ఎటువంటి జాతియ్యమో యేరుపరచఁగరాదు
(॥పల్లవి॥)
ఎటువంటి జాతియ్యమో యేరుపరచఁగరాదు
కుటిలకుంతలులాల కొమ్మఁ జూడరమ్మ
(॥ఎటు॥)
పడఁతి సెలవులను పలుమారు నవ్వఁగాను
విడువక చందురుఁడు వెన్నెల గాసె
బడిబడి నప్పటిని పాటలు వాడఁగాను
యెడ నెడఁ గోయిలలు యెలుఁ గియ్యఁ దొడఁగె
(॥ఎటు॥)
చందపుఁజూపుల నీపె సారె సారెఁ జూడఁగాను
పొందులకుఁ జకోరాలు పొలయఁ జొచ్చె
మందలించి చన్నులచెమట లార్చుకొనఁగాను
గొంది నున్నజక్కవలు గుంపుగూడఁ దొడఁగె
(॥ఎటు॥)
శ్రీ వేంకటేశుకడకు చెలి యేఁగి రాఁగాను
వేవేగ రాయంచలెల్లా వెంటరాఁ జొచ్చె
చేవదేరి యీపెమేను చెంగలించి వుండఁగాను
పూవుఁదీగె మిక్కిలిని పొదలఁగఁ దొడఁగె
(||pallavi||)
ĕḍuvaṁṭi jādiyyamo yerubarasam̐garādu
kuḍilaguṁtalulāla kŏmmam̐ jūḍaramma
(||ĕḍu||)
paḍam̐ti sĕlavulanu palumāru navvam̐gānu
viḍuvaga saṁdurum̐ḍu vĕnnĕla gāsĕ
baḍibaḍi nappaḍini pāḍalu vāḍam̐gānu
yĕḍa nĕḍam̐ goyilalu yĕlum̐ giyyam̐ dŏḍam̐gĕ
(||ĕḍu||)
saṁdabum̐jūbula nībĕ sārĕ sārĕm̐ jūḍam̐gānu
pŏṁdulagum̐ jagorālu pŏlayam̐ jŏchchĕ
maṁdaliṁchi sannulasĕmaḍa lārsugŏnam̐gānu
gŏṁdi nunnajakkavalu guṁpugūḍam̐ dŏḍam̐gĕ
(||ĕḍu||)
śhrī veṁkaḍeśhugaḍagu sĕli yem̐gi rām̐gānu
vevega rāyaṁchalĕllā vĕṁṭarām̐ jŏchchĕ
sevaderi yībĕmenu sĕṁgaliṁchi vuṁḍam̐gānu
pūvum̐dīgĕ mikkilini pŏdalam̐gam̐ dŏḍam̐gĕ