ఎటువంటి దొరతన మేమి నేరుచుకొంటివి
(॥పల్లవి॥)
ఎటువంటి దొరతన మేమి నేరుచుకొంటివి
తటుకన నీకు నీవే తగ వెంచవలదా
(॥ఎటు॥)
ఆరగించ రమ్మని ఆపె నిన్నుఁ బిలువఁగా
చేరి నీసతికి విందు చెప్పుమనేవు
నేరపుతో వలచిన నీకుఁ బ్రియ మింతేకాక
యీరసపువనితలు ఇంత కోపఁగలదా
(॥ఎటు॥)
వేడుకతో నప్పటి విడేము కియ్యఁగాను
కూడా నున్నచెలి నందుకొమ్మనేవు
ఆడ నీవదినెయైతే ఆపె నీకు దొడ్డుగాక
యీడుజోడు సవతులు యింత కోపఁగలరా
(॥ఎటు॥)
ఆకె కాఁగిటఁ గూడి అట్టె నిన్ను మెచ్చఁగాను
మేకొని నీ దేవులనే మెచ్చుమనేవు
యీకడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యీకడాకడిసతులు యింత కోపఁగలరా
(||pallavi||)
ĕḍuvaṁṭi dŏradana memi nerusugŏṁṭivi
taḍugana nīgu nīve taga vĕṁchavaladā
(||ĕḍu||)
āragiṁcha rammani ābĕ ninnum̐ biluvam̐gā
seri nīsadigi viṁdu sĕppumanevu
nerabudo valasina nīgum̐ briya miṁtegāga
yīrasabuvanidalu iṁta kobam̐galadā
(||ĕḍu||)
veḍugado nappaḍi viḍemu kiyyam̐gānu
kūḍā nunnasĕli naṁdugŏmmanevu
āḍa nīvadinĕyaide ābĕ nīgu dŏḍḍugāga
yīḍujoḍu savadulu yiṁta kobam̐galarā
(||ĕḍu||)
āgĕ kām̐giḍam̐ gūḍi aṭṭĕ ninnu mĕchcham̐gānu
megŏni nī devulane mĕchchumanevu
yīgaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yīgaḍāgaḍisadulu yiṁta kobam̐galarā