ఎటువంటి భాగ్యమో యీపెకు నేఁడు
(॥పల్లవి॥)
ఎటువంటి భాగ్యమో యీపెకు నేఁడు
తటుకనఁ దాను దొరతనము మెరసెను
(॥ఎటు॥)
చద్దికి వేఁడికి నీవు సారెసారె వేఁడుకోఁగా
పెద్దరికమున కాపె బిగిసీ నీతో
యిద్దరు నిద్దరేయని యీడనున్నసతులు మీ-
సుద్దులు వొగడుకొంటా చూచేరు మిమ్మును
(॥ఎటు ॥)
వుమ్మగిలుఁ జెమటతో వొడివట్టి తియ్యఁగాను
యెమ్మెలకే పెనఁగీ నిట్టె నీతో
అమ్మరో నీవాకెకు అరవి సమత్తువేమో
చిమ్మిరేఁగి తరితీపు చిందీ మీవల్లను
(॥ఎటు॥)
నెట్టనఁ దమకమున నీవు గాఁగిలించుకోంగా
బట్టబయలీఁది యాకె భ్రమసీ నీతో
ఇట్టె శ్రీవేంకటేశ యే నలమేలుమంగను
గట్టిగా నన్నేలితివి కంటిమి మీపొందులు
(||pallavi||)
ĕḍuvaṁṭi bhāgyamo yībĕgu nem̐ḍu
taḍuganam̐ dānu dŏradanamu mĕrasĕnu
(||ĕḍu||)
saddigi vem̐ḍigi nīvu sārĕsārĕ vem̐ḍugom̐gā
pĕddarigamuna kābĕ bigisī nīdo
yiddaru niddareyani yīḍanunnasadulu mī-
suddulu vŏgaḍugŏṁṭā sūseru mimmunu
(||ĕḍu ||)
vummagilum̐ jĕmaḍado vŏḍivaṭṭi tiyyam̐gānu
yĕmmĕlage pĕnam̐gī niṭṭĕ nīdo
ammaro nīvāgĕgu aravi samattuvemo
simmirem̐gi taridību siṁdī mīvallanu
(||ĕḍu||)
nĕṭṭanam̐ damagamuna nīvu gām̐giliṁchugoṁgā
baṭṭabayalīm̐di yāgĕ bhramasī nīdo
iṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelumaṁganu
gaṭṭigā nannelidivi kaṁṭimi mībŏṁdulu