ఎటువలెఁ జేసితివో యెఱఁగ మెన్నఁడును
(॥పల్లవి॥)
ఎటువలెఁ జేసితివో యెఱఁగ మెన్నఁడును
ఘటియించవయ్యా మాతో కందము నీ సుద్దులు
(॥ఎటు॥)
పూసినకస్తూరి పూఁత పొంచినట్టినడురేయి
వోసరించి మాయధర ముట్టిపై పాలు
ఆసపడి గొల్లయిండ్ల నల్లఁవాడు సేసినట్లు
సేసి చూపవయ్య మాకు చిత్రము నీసుద్దులు
(॥ఎటు॥)
అదె మాసెలవినవ్వు యమునలోని వెన్నెల
చదురుసరసాలు రాసక్రీడలు
తుదిముట్ట గొల్లెతల తొల్లి నీవు సేసినట్లు
యిదె మాతోఁ జేయవయ్య యెట్టివో నీసుద్దులు
(॥ఎటు॥)
ఇక్కువ బృందావనము ఇచ్చట మాజవ్వనము
చక్కనిసతుల పొందుసరి నాపొందు
చిక్కి శ్రీవేంకటేశ్వర చిన్ననాఁడు గొల్లెతల
చొక్కించినట్టె చొక్కించు చూతము నీసుద్దులు
(||pallavi||)
ĕḍuvalĕm̐ jesidivo yĕṟam̐ga mĕnnam̐ḍunu
ghaḍiyiṁchavayyā mādo kaṁdamu nī suddulu
(||ĕḍu||)
pūsinagastūri pūm̐ta pŏṁchinaṭṭinaḍureyi
vosariṁchi māyadhara muṭṭibai pālu
āsabaḍi gŏllayiṁḍla nallam̐vāḍu sesinaṭlu
sesi sūbavayya māgu sitramu nīsuddulu
(||ĕḍu||)
adĕ māsĕlavinavvu yamunaloni vĕnnĕla
sadurusarasālu rāsakrīḍalu
tudimuṭṭa gŏllĕdala tŏlli nīvu sesinaṭlu
yidĕ mādom̐ jeyavayya yĕṭṭivo nīsuddulu
(||ĕḍu||)
ikkuva bṛṁdāvanamu ichchaḍa mājavvanamu
sakkanisadula pŏṁdusari nābŏṁdu
sikki śhrīveṁkaḍeśhvara sinnanām̐ḍu gŏllĕdala
sŏkkiṁchinaṭṭĕ sŏkkiṁchu sūdamu nīsuddulu