Eduvale siddhimchu nee panulu yevvaru vinnaa navvuduru

ఎటువలె సిద్ధించు నీ పనులు యెవ్వరు విన్నా నవ్వుదురు
Language

(॥పల్లవి॥)
ఎటువలె సిద్ధించు నీ పనులు యెవ్వరు విన్నా నవ్వుదురు
తటుకున నుండుట దాలిగుంతయట తలఁపులు మేడా మాడుగులు

(॥ఎటు॥)
నీవే బ్రహ్మాండనాథుఁడవు నే నొక మశకమను
యీవల నీ ప్రత్యక్షము గోరెద నెక్కడి కెక్కడ అసంగతం
ఆవటించి నేఁజేసిన వైతే నపరాధంబులు వేవేలు
కావ వనుచు నే నిన్నుఁ బలికెదను కడు సాహసుఁడఁగా నేను

(॥ఎటు॥)
నిక్కము నీవు స్వతంత్రుఁడవు నేమాయాపరతంత్రుఁడనూ
యిక్కువ నీపై భక్తి నేసెదను యెక్కడికెక్కడ అసంగతం
యిక్కడ నే మోచినది కన్గొనఁగ నేడుజానలది శరీరము
కక్కసించి నిను ధ్యానము సేసెద కడుసాహసుఁడఁగా నేను

(॥ఎటు॥)
హెచ్చిన నీ చిత్తము గానా యేచిన నా భాగ్యము దెలియా
యిచ్చలనే బయలకు మొరవెట్టెద యెక్కడి కెక్కడ అసంగతం
కచ్చు పెట్టి శ్రీవేంకటనాయక కరుణించితి విటు నను నీవే
గచ్చుల వూరకె నిన్నుఁ బొగడెదను కడుసాహసుఁడగా నేను

(||pallavi||)
ĕḍuvalĕ siddhiṁchu nī panulu yĕvvaru vinnā navvuduru
taḍuguna nuṁḍuḍa dāliguṁtayaḍa talam̐pulu meḍā māḍugulu

(||ĕḍu||)
nīve brahmāṁḍanāthum̐ḍavu ne nŏga maśhagamanu
yīvala nī pratyakṣhamu gorĕda nĕkkaḍi kĕkkaḍa asaṁgadaṁ
āvaḍiṁchi nem̐jesina vaide nabarādhaṁbulu vevelu
kāva vanusu ne ninnum̐ baligĕdanu kaḍu sāhasum̐ḍam̐gā nenu

(||ĕḍu||)
nikkamu nīvu svadaṁtrum̐ḍavu nemāyābaradaṁtrum̐ḍanū
yikkuva nībai bhakti nesĕdanu yĕkkaḍigĕkkaḍa asaṁgadaṁ
yikkaḍa ne mosinadi kangŏnam̐ga neḍujānaladi śharīramu
kakkasiṁchi ninu dhyānamu sesĕda kaḍusāhasum̐ḍam̐gā nenu

(||ĕḍu||)
hĕchchina nī sittamu gānā yesina nā bhāgyamu dĕliyā
yichchalane bayalagu mŏravĕṭṭĕda yĕkkaḍi kĕkkaḍa asaṁgadaṁ
kachchu pĕṭṭi śhrīveṁkaḍanāyaga karuṇiṁchidi viḍu nanu nīve
gachchula vūragĕ ninnum̐ bŏgaḍĕdanu kaḍusāhasum̐ḍagā nenu