Eduvale nunnado yippudu nee sittamu

ఎటువలె నున్నదో యిప్పుడు నీ చిత్తము
Language

(॥పల్లవి॥)
ఎటువలె నున్నదో యిప్పుడు నీ చిత్తము
తటుకన నన్నియును దలఁచుకో నీవే

(॥ఎటు॥)
మూసినముత్తెమువలె ముంగిట నే నుండఁగాను
ఆసలఁ బెట్టితివిగా అప్పుడు నీవు
నీసరి నే నిలుచుండి నీమొగము చూచితేను
సేసలు వెట్టితివిగా చేతులారను

(॥ఎటు॥)
చిమ్ముచు నేఁగొనగోర చేతులెత్తి మొక్కితేను
నమ్మిక లిచ్చితివిగా నాకు నీవు
వుమ్మడి నే నెంతైనా వొడ్డించుకొనఁగాను
సమ్మతింపించితివిగా చలపట్టి నన్నును

(॥ఎటు॥)
కొలువులోపల నేను గుట్టుతోనే వుండఁగాను
పిలిచి నవ్వితివిగా ప్రియముతోను
యెలమి శ్రీ వేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
వలపు రేఁచితివిగా వాడికగాను

(||pallavi||)
ĕḍuvalĕ nunnado yippuḍu nī sittamu
taḍugana nanniyunu dalam̐sugo nīve

(||ĕḍu||)
mūsinamuttĕmuvalĕ muṁgiḍa ne nuṁḍam̐gānu
āsalam̐ bĕṭṭidivigā appuḍu nīvu
nīsari ne nilusuṁḍi nīmŏgamu sūsidenu
sesalu vĕṭṭidivigā sedulāranu

(||ĕḍu||)
simmusu nem̐gŏnagora sedulĕtti mŏkkidenu
nammiga lichchidivigā nāgu nīvu
vummaḍi ne nĕṁtainā vŏḍḍiṁchugŏnam̐gānu
sammadiṁpiṁchidivigā salabaṭṭi nannunu

(||ĕḍu||)
kŏluvulobala nenu guṭṭudone vuṁḍam̐gānu
pilisi navvidivigā priyamudonu
yĕlami śhrī veṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
valabu rem̐sidivigā vāḍigagānu