Eduvale nammimcheene yimkam danasittamu

ఎటువలె నమ్మించీనే యిఁకఁ దనచిత్తము
Language

(॥పల్లవి॥)
ఎటువలె నమ్మించీనే యిఁకఁ దనచిత్తము
అటమటముల కోప నడుగరే ఆతని

(॥ఎటు॥)
మొగముచూచునందాఁకానేమంచినయెడమాటలు
నగినదాఁకానే నంటునేర్పులు
తగులైనదాఁకానే తలపోఁతలెల్లాను
అగపడ్డదాఁకానే ఆసలన్నియును

(॥ఎటు॥)
ననుపైనదాఁకానే నయగారితనములు
మనసుగన్నదాఁకానే మంతనములు
చనవిచ్చుదాఁకానే సముకపుఁగొలువులు
యెనసినదాఁకానే యిచ్చకములు

(॥ఎటు॥)
తతి గూడుదాఁకానే తరితీపులన్నియును
రతిఁ జొక్కుదాఁకానే సమ్మతి మొక్కులు
యితవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
సతమైనదాఁకానే చవులెల్లాను

(||pallavi||)
ĕḍuvalĕ nammiṁchīne yim̐kam̐ danasittamu
aḍamaḍamula koba naḍugare ādani

(||ĕḍu||)
mŏgamusūsunaṁdām̐kānemaṁchinayĕḍamāḍalu
naginadām̐kāne naṁṭunerbulu
tagulainadām̐kāne talabom̐talĕllānu
agabaḍḍadām̐kāne āsalanniyunu

(||ĕḍu||)
nanubainadām̐kāne nayagāridanamulu
manasugannadām̐kāne maṁtanamulu
sanavichchudām̐kāne samugabum̐gŏluvulu
yĕnasinadām̐kāne yichchagamulu

(||ĕḍu||)
tadi gūḍudām̐kāne taridībulanniyunu
radim̐ jŏkkudām̐kāne sammadi mŏkkulu
yidavai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
sadamainadām̐kāne savulĕllānu