ఎటువలె మన్నింతువో యెంత మరిగెనో యీకె
(॥పల్లవి॥)
ఎటువలె మన్నింతువో యెంత మరిగెనో యీకె
అటువంటి జాణతనా లమరు మీకు మీకె
(॥ఎటు॥)
ఇంతి నీవాడిన మాట యెదలోన నమ్ముకొని
కంతునికి వెరవదు కాఁతాళించదు
మంతనాన నీమీఁది మచ్చికలు దలఁచుక
సంతతము లోలోనె సంతోసించుకొనును
(॥ఎటు॥)
ఇందుముఖి నీచనవు లిట్టె గట్టిసేసికొని
చందమామ గైకోదు జడియదు
చెంది నిన్నుఁ గూడే యాస చిత్తములోఁ బెట్టుకొని
అందెందె చెలులతోడ నాడుకొని మెచ్చును
(॥ఎటు॥)
అలమేలుమంగ నీ నెయ్యపురతులనుఁ జొక్కి
చలిగాలి కలుకదు జాలిబడదు
యెలమి శ్రీవేంకటేశ యేలితి వింతలో వచ్చి
చెలఁగి ఇందుకే నీకు సేవలెల్లాఁ జేసును
(||pallavi||)
ĕḍuvalĕ manniṁtuvo yĕṁta marigĕno yīgĕ
aḍuvaṁṭi jāṇadanā lamaru mīgu mīgĕ
(||ĕḍu||)
iṁti nīvāḍina māḍa yĕdalona nammugŏni
kaṁtunigi vĕravadu kām̐tāḽiṁchadu
maṁtanāna nīmīm̐di machchigalu dalam̐suga
saṁtadamu lolonĕ saṁtosiṁchugŏnunu
(||ĕḍu||)
iṁdumukhi nīsanavu liṭṭĕ gaṭṭisesigŏni
saṁdamāma gaigodu jaḍiyadu
sĕṁdi ninnum̐ gūḍe yāsa sittamulom̐ bĕṭṭugŏni
aṁdĕṁdĕ sĕluladoḍa nāḍugŏni mĕchchunu
(||ĕḍu||)
alamelumaṁga nī nĕyyaburadulanum̐ jŏkki
saligāli kalugadu jālibaḍadu
yĕlami śhrīveṁkaḍeśha yelidi viṁtalo vachchi
sĕlam̐gi iṁduge nīgu sevalĕllām̐ jesunu