ఎటువలె మన్నించినా నియ్యకొందుఁగాక నేను
(॥పల్లవి॥)
ఎటువలె మన్నించినా నియ్యకొందుఁగాక నేను
తటుకున నిన్ను మరి తగవులఁ బెట్టేనా
(॥ఎటు॥)
వలపు నీవు చల్లగా వద్దని నే వారించి
చలములు సాదించేనా సారెసారెకు
కలువల నీవు వేసి కన్నులను నవ్వఁగాను
మలసి సొలపి నీతో మారుమలసేనా
(॥ఎటు॥)
చేతులు చాఁచి నీవు చెనకిమన్నించఁగాను
గాతల జంకించేనా కాదంటాను
రాతిరిఁ బగలు మోవిరసాలు నాకియ్యఁగాను
యేతులకు నే నిన్ను యెగసెక్కెలాడేనా
(॥ఎటు॥)
పచ్చడము గప్పి నాగుబ్బలు నీవు ముట్టుఁగాను
పెచ్చువెరుగుచు నేఁ దప్పించుకొనేనా
యిచ్చట శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
యిచ్చగించి వుందుఁగాక యిఁక నేలోఁగేనా
(||pallavi||)
ĕḍuvalĕ manniṁchinā niyyagŏṁdum̐gāga nenu
taḍuguna ninnu mari tagavulam̐ bĕṭṭenā
(||ĕḍu||)
valabu nīvu sallagā vaddani ne vāriṁchi
salamulu sādiṁchenā sārĕsārĕgu
kaluvala nīvu vesi kannulanu navvam̐gānu
malasi sŏlabi nīdo mārumalasenā
(||ĕḍu||)
sedulu sām̐si nīvu sĕnagimanniṁcham̐gānu
gādala jaṁkiṁchenā kādaṁṭānu
rādirim̐ bagalu movirasālu nāgiyyam̐gānu
yedulagu ne ninnu yĕgasĕkkĕlāḍenā
(||ĕḍu||)
pachchaḍamu gappi nāgubbalu nīvu muṭṭum̐gānu
pĕchchuvĕrugusu nem̐ dappiṁchugŏnenā
yichchaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
yichchagiṁchi vuṁdum̐gāga yim̐ka nelom̐genā