Eduvale bujjagimchi yeederimchevo kaani

ఎటువలె బుజ్జగించి యీడేరించేవో కాని
Language

(॥పల్లవి॥)
ఎటువలె బుజ్జగించి యీడేరించేవో కాని
తటుకన నీకు మొక్కె తతియేదో కాని

(॥ఎటు॥)
మత్తగజగమనకు మనవి యెంతైనాఁ గద్దు
చిత్త మెరఁగక నీతోఁ జెప్పదు గాని
హత్తి నీతో మాటలాడే ఆస యెంతైనాఁ గద్దు
తత్తరపు సిగ్గులతోఁ దలవంచీఁ గాని

(॥ఎటు॥)
ముసిముసి నవ్వులకు ముచ్చటెంతై నాఁ గద్దు
సుసరాన తనగుట్టు చూపదు గాని
వసివాడుతనముల వలపెంతైనాఁ గద్దు
పసురు వయసుతోడఁ బదరదు గాని

(॥ఎటు॥)
అట్టె నిన్నుఁ గూడె నిదె అలపెంతైనాఁ గద్దు
దిట్టతనాన వెనక తియ్యదు గాని
నెట్టన శ్రీవేంకటేశ నీవె యేలితి వాపెను
బట్టిగొన నిన్నాపె జంకించదు గాని

(||pallavi||)
ĕḍuvalĕ bujjagiṁchi yīḍeriṁchevo kāni
taḍugana nīgu mŏkkĕ tadiyedo kāni

(||ĕḍu||)
mattagajagamanagu manavi yĕṁtainām̐ gaddu
sitta mĕram̐gaga nīdom̐ jĕppadu gāni
hatti nīdo māḍalāḍe āsa yĕṁtainām̐ gaddu
tattarabu sigguladom̐ dalavaṁchīm̐ gāni

(||ĕḍu||)
musimusi navvulagu muchchaḍĕṁtai nām̐ gaddu
susarāna tanaguṭṭu sūbadu gāni
vasivāḍudanamula valabĕṁtainām̐ gaddu
pasuru vayasudoḍam̐ badaradu gāni

(||ĕḍu||)
aṭṭĕ ninnum̐ gūḍĕ nidĕ alabĕṁtainām̐ gaddu
diṭṭadanāna vĕnaga tiyyadu gāni
nĕṭṭana śhrīveṁkaḍeśha nīvĕ yelidi vābĕnu
baṭṭigŏna ninnābĕ jaṁkiṁchadu gāni