ఎదురుచూచీఁ జెలియ ఇంటి కిట్టె రారాదా
(॥పల్లవి॥)
ఎదురుచూచీఁ జెలియ ఇంటి కిట్టె రారాదా
ఇదివో ఇక్కడ నీవు యేమి సే సేవయ్యా
(॥ఎదు॥)
ప్రియములు చెప్పియెప్పి పిలువనంపనే పట్టె
నయముతోఁ జెలియకు నాథుఁడ నిన్ను
దయవుట్ట మాటలాడితగుల నిందాఁకాఁ బట్టె
నియతాన నెప్పుడు మన్నించేవయ్యా
(॥ఎదు॥)
తమితోడ నీరూపు తలపోయనే పట్టె
మమకారాన సతికి మగఁడ నిన్ను
సముకానకు లేకలు సారె వ్రాయనే పట్టె
జమళిగూడి యెప్పుడు చలవిచ్చేవయ్యా
(॥ఎదు॥)
కాంతలతో నీగుణాలు కడుఁబొగడనే పట్టె
ఇంతికిని శ్రీవేంకటేశుఁడ నిన్ను
యింతలో నీకెఁ గూడితి వీడకే నీవు వచ్చి
వంతులో దినము నిట్టె వరమియ్యవయ్యా
(||pallavi||)
ĕdurusūsīm̐ jĕliya iṁṭi kiṭṭĕ rārādā
idivo ikkaḍa nīvu yemi se sevayyā
(||ĕdu||)
priyamulu sĕppiyĕppi piluvanaṁpane paṭṭĕ
nayamudom̐ jĕliyagu nāthum̐ḍa ninnu
dayavuṭṭa māḍalāḍidagula niṁdām̐kām̐ baṭṭĕ
niyadāna nĕppuḍu manniṁchevayyā
(||ĕdu||)
tamidoḍa nīrūbu talaboyane paṭṭĕ
mamagārāna sadigi magam̐ḍa ninnu
samugānagu legalu sārĕ vrāyane paṭṭĕ
jamaḽigūḍi yĕppuḍu salavichchevayyā
(||ĕdu||)
kāṁtalado nīguṇālu kaḍum̐bŏgaḍane paṭṭĕ
iṁtigini śhrīveṁkaḍeśhum̐ḍa ninnu
yiṁtalo nīgĕm̐ gūḍidi vīḍage nīvu vachchi
vaṁtulo dinamu niṭṭĕ varamiyyavayyā