Edurusooseem jeli yeṟuga neegu ledaa

ఎదురుచూచీఁ జెలి యెఱుక నీకు లేదా
Language

(॥పల్లవి॥)
ఎదురుచూచీఁ జెలి యెఱుక నీకు లేదా
సదరాన రావయ్య చలపట్ట కిపుడు

(॥ఎదు॥)
కలికిగుబ్బలనేటికమలపుమొగ్గలు
యెలమితో నీకు మీఁదెత్తుకున్నది
తలఁప మోవితేనె తరివట్టుకున్నది
పిలువుమనె రావయ్య పెనఁగక ఇపుడు

(॥ఎదు॥)
కడివోనిమాటలనేకప్పురపుఁబలుకులు
బడిబడిఁ గానుకగాఁ బట్టుకున్నది
వెడనవ్వుచిలుపాలు విందువెట్టే ననున్నది
వొడికాన రావయ్య వోసరించ కిపుడు

(॥ఎదు॥)
కలయుఁ గాఁగిలనేటి కమ్మనివులుపా నీకు
సొలయుచు సూడిదెగాఁ జూపుకున్నది
అలరి శ్రీవేంకటేశ అంతలోనె కూడితివి
నెలవుకొని రావయ్య నీయంతనే యిపుడు

(||pallavi||)
ĕdurusūsīm̐ jĕli yĕṟuga nīgu ledā
sadarāna rāvayya salabaṭṭa kibuḍu

(||ĕdu||)
kaligigubbalaneḍigamalabumŏggalu
yĕlamido nīgu mīm̐dĕttugunnadi
talam̐pa movidenĕ tarivaṭṭugunnadi
piluvumanĕ rāvayya pĕnam̐gaga ibuḍu

(||ĕdu||)
kaḍivonimāḍalanegappurabum̐balugulu
baḍibaḍim̐ gānugagām̐ baṭṭugunnadi
vĕḍanavvusilubālu viṁduvĕṭṭe nanunnadi
vŏḍigāna rāvayya vosariṁcha kibuḍu

(||ĕdu||)
kalayum̐ gām̐gilaneḍi kammanivulubā nīgu
sŏlayusu sūḍidĕgām̐ jūbugunnadi
alari śhrīveṁkaḍeśha aṁtalonĕ kūḍidivi
nĕlavugŏni rāvayya nīyaṁtane yibuḍu