(॥పల్లవి॥)
ఎదురుచూచీఁ జెలి యేమయ్యా
నిదుర కన్నులఁ దేరీ నీకేలయ్యా
(॥॥)
చెక్కిటఁబెట్టినచెయ్యి చిత్తములోపలినుయ్యి
యెక్కడికిఁ గాదు యేమయ్యా
పక్కున నవ్వేవు కొప్పు పైపై గోర దువ్వేవు
నెక్కొని వట్టిదోసాలు నీకేలయ్యా
(॥॥)
పాదపు నేలలవ్రాత బలిసె నూరుపుమోఁత
యీదెస చెలియకేల యేమయ్యా
మోదమున నొరగేవు మొక్కలానఁ దిరిగేవు
నీదయ నేఁడు దాఁచఁగ నీకేలయ్యా
(॥॥)
మూపుపై జారిన కొప్పు ముంచిన చెమటల చొప్పు
యేపొద్దు జెలికిఁ బాయ దేమయ్యా
దాపై శ్రీవేంకటేశ తరుణిఁ గూడితి విట్టె
నీపరవశాలు చూప నీకేలయ్యా
(||pallavi||)
ĕdurusūsīm̐ jĕli yemayyā
nidura kannulam̐ derī nīgelayyā
(||||)
sĕkkiḍam̐bĕṭṭinasĕyyi sittamulobalinuyyi
yĕkkaḍigim̐ gādu yemayyā
pakkuna navvevu kŏppu paibai gora duvvevu
nĕkkŏni vaṭṭidosālu nīgelayyā
(||||)
pādabu nelalavrāda balisĕ nūrubumom̐ta
yīdĕsa sĕliyagela yemayyā
modamuna nŏragevu mŏkkalānam̐ dirigevu
nīdaya nem̐ḍu dām̐sam̐ga nīgelayyā
(||||)
mūbubai jārina kŏppu muṁchina sĕmaḍala sŏppu
yebŏddu jĕligim̐ bāya demayyā
dābai śhrīveṁkaḍeśha taruṇim̐ gūḍidi viṭṭĕ
nībaravaśhālu sūba nīgelayyā