Edurusoosee neegu neppudu vattuvoyamtaa

ఎదురుచూచీ నీకు నెప్పుడు వత్తువోయంటా
Language

(॥పల్లవి॥)
ఎదురుచూచీ నీకు నెప్పుడు వత్తువోయంటా
పదివేలుగా విన్నపములు సేసితిమి

(॥ఎదు॥)
చేరఁడేసికన్నుల జెలినిన్నుఁజూచెను
కోరినీకు వలచి ఇక్కువ నున్నది
నేరుపుతోఁ గానుకగా నిమ్మపండంపె విదె
వేరు సేయక రావయ్య వెలఁదికడకును

(॥ఎదు॥)
కొండలంతలేసి పెనుగుబ్బలు నీకు మీఁదెత్తే
నిండుమనసెల్లాను నీపైఁ బెట్టె
దండిగా నేపోద్దూను తపముసేసీ నీకు
మెండుకొన్నకరుణతో మెలుఁతఁ జూడవయ్యా

(॥ఎదు॥)
ముంచి మూరెఁడంత కోప్పు వంచి నీకు మొక్కెను
అంచెలఁ జెప్పరాని ప్రియము చెప్పెను
కొంచ కలమేలుమంగఁ గూడితి శ్రీవేంకటేశ
యెంచక మన్నించవయ్య ఇట్టె కలకాలము

(||pallavi||)
ĕdurusūsī nīgu nĕppuḍu vattuvoyaṁṭā
padivelugā vinnabamulu sesidimi

(||ĕdu||)
seram̐ḍesigannula jĕlininnum̐jūsĕnu
korinīgu valasi ikkuva nunnadi
nerubudom̐ gānugagā nimmabaṁḍaṁpĕ vidĕ
veru seyaga rāvayya vĕlam̐digaḍagunu

(||ĕdu||)
kŏṁḍalaṁtalesi pĕnugubbalu nīgu mīm̐dĕtte
niṁḍumanasĕllānu nībaim̐ bĕṭṭĕ
daṁḍigā neboddūnu tabamusesī nīgu
mĕṁḍugŏnnagaruṇado mĕlum̐tam̐ jūḍavayyā

(||ĕdu||)
muṁchi mūrĕm̐ḍaṁta koppu vaṁchi nīgu mŏkkĕnu
aṁchĕlam̐ jĕpparāni priyamu sĕppĕnu
kŏṁcha kalamelumaṁgam̐ gūḍidi śhrīveṁkaḍeśha
yĕṁchaga manniṁchavayya iṭṭĕ kalagālamu