ఎదురుఁగొండ లెక్కి ఇందిర గాఁగిలించఁగా
(॥పల్లవి॥)
ఎదురుఁగొండ లెక్కి ఇందిర గాఁగిలించఁగా
పెదపెద చన్ను లెంత పిసికేవు నీవు
(॥ఎదు॥)
ముసిముసినవ్వు నవ్విమొక్కుచునిన్నుఁగూరిమి
గొసరఁగాఁ జెలినేల కొంగువట్టేవు
సుసరానఁ జెమటార నురటి చేఁబట్టి నీకు
విసరఁగా నీకె నెట్టు వేసేవు పూవులను
(॥ఎదు॥)
కన్నులను జంకించి కమ్మటి నీచెవిలోన
విన్నవించఁగా నేమి విఱ్ఱవీఁగేవు
సన్నలనే వలపులు చవిచూపి నీవొద్ద
కిన్నెర మీఁటఁగా నెట్టు గిలిగించేవు
(॥ఎదు॥)
పానుపుపైఁ బవ్వళించి పయ్యద నీకుఁ గప్పి
వూని చెనకఁగా నెంట బుజ్జగించేవు
అనుక శ్రీవేంకటాద్రి నౌభళాన నిన్నుఁ గూడి
తానకమై తొడెక్కఁగా తగమన్నించేవు
(||pallavi||)
ĕdurum̐gŏṁḍa lĕkki iṁdira gām̐giliṁcham̐gā
pĕdabĕda sannu lĕṁta pisigevu nīvu
(||ĕdu||)
musimusinavvu navvimŏkkusuninnum̐gūrimi
gŏsaram̐gām̐ jĕlinela kŏṁguvaṭṭevu
susarānam̐ jĕmaḍāra nuraḍi sem̐baṭṭi nīgu
visaram̐gā nīgĕ nĕṭṭu vesevu pūvulanu
(||ĕdu||)
kannulanu jaṁkiṁchi kammaḍi nīsĕvilona
vinnaviṁcham̐gā nemi viṭravīm̐gevu
sannalane valabulu savisūbi nīvŏdda
kinnĕra mīm̐ṭam̐gā nĕṭṭu giligiṁchevu
(||ĕdu||)
pānububaim̐ bavvaḽiṁchi payyada nīgum̐ gappi
vūni sĕnagam̐gā nĕṁṭa bujjagiṁchevu
anuga śhrīveṁkaḍādri naubhaḽāna ninnum̐ gūḍi
tānagamai tŏḍĕkkam̐gā tagamanniṁchevu