(॥పల్లవి॥)
ఎదురుమాటలు నీతో నేమందురా
చెగరెఁ గస్తురిబొట్టు చెనకనేఁటికిరా
(॥ఎదు॥)
కూరిమి రెట్టించె నాకు కొనగోరు వాఁడాయ
యేరా నీవింకా నాతో నేమనేవురా
సారె జారీఁ జెమట చన్నుల కొనలవెంట
యీరీతి వేఁడుకొన నేనేమి బాఁతిరా
(॥ఎదు॥)
జవ్వనము తతివచ్చె జడివట్టె నవ్వులెల్లా
యివ్వల నాతో నీవు యేమనేవురా
పువ్వులతురుము వీడి బుజమురేకలు రాఁగె
తవ్వేవు నాసిగ్గులెల్ల తగునటరా
(॥ఎదు॥)
రతు లెన్నికకువచ్చె రాసులాయఁ గళలెల్లా
యితవులు నాతో నేఁడు యేమనేవురా
సతమై శ్రీ వేంకటేశ చనవిచ్చి కూడితివి
పతినలు పలికేవు పట్టపుదేవినిరా
(||pallavi||)
ĕdurumāḍalu nīdo nemaṁdurā
sĕgarĕm̐ gasturibŏṭṭu sĕnaganem̐ṭigirā
(||ĕdu||)
kūrimi rĕṭṭiṁchĕ nāgu kŏnagoru vām̐ḍāya
yerā nīviṁkā nādo nemanevurā
sārĕ jārīm̐ jĕmaḍa sannula kŏnalavĕṁṭa
yīrīdi vem̐ḍugŏna nenemi bām̐tirā
(||ĕdu||)
javvanamu tadivachchĕ jaḍivaṭṭĕ navvulĕllā
yivvala nādo nīvu yemanevurā
puvvuladurumu vīḍi bujamuregalu rām̐gĕ
tavvevu nāsiggulĕlla tagunaḍarā
(||ĕdu||)
radu lĕnnigaguvachchĕ rāsulāyam̐ gaḽalĕllā
yidavulu nādo nem̐ḍu yemanevurā
sadamai śhrī veṁkaḍeśha sanavichchi kūḍidivi
padinalu paligevu paṭṭabudevinirā