Edurugudurugaanu yela navveene

ఎదురుగుదురుగాను యేల నవ్వీనే
Language

(॥పల్లవి॥)
ఎదురుగుదురుగాను యేల నవ్వీనే
యెదుగా తడవునుండి యేల నవ్వీనే

(॥ఎదురు॥)
వరుసలు వంతులును వనితలమాడుకోఁగా
యిరవైన విభుఁడు తానేల నవ్వీనే
తరమిడి నిద్దరము తన్నుఁ దగవడిగితే
యెరవులు సేసుకొని యేల నవ్వీనే

(॥ఎదురు॥)
వొక్కరొక్కరము సొమ్ములొనర సరిచూడఁగ
యిక్కువైన రమణుఁడు యేల నవ్వీనే
చక్కఁగా మాలోనేమమ్ము సంతము సేయిమంటాను
యిక్కడా మామోము చూచి యేల నవ్వీనే

(॥ఎదురు॥)
మోవిమీఁదిగుఱుతులు మూసుకొనేమమ్ముఁ జూచి
యీవేళ శ్రీవేంకటేశుఁడేల నవ్వీనే
భావించి మమ్మేలితివి పాడి దిద్దుమంటేను
యేవెలఁదులతోనైన నేల నవ్వీనే

(||pallavi||)
ĕdurugudurugānu yela navvīne
yĕdugā taḍavunuṁḍi yela navvīne

(||ĕduru||)
varusalu vaṁtulunu vanidalamāḍugom̐gā
yiravaina vibhum̐ḍu tānela navvīne
taramiḍi niddaramu tannum̐ dagavaḍigide
yĕravulu sesugŏni yela navvīne

(||ĕduru||)
vŏkkarŏkkaramu sŏmmulŏnara sarisūḍam̐ga
yikkuvaina ramaṇum̐ḍu yela navvīne
sakkam̐gā mālonemammu saṁtamu seyimaṁṭānu
yikkaḍā māmomu sūsi yela navvīne

(||ĕduru||)
movimīm̐diguṟudulu mūsugŏnemammum̐ jūsi
yīveḽa śhrīveṁkaḍeśhum̐ḍela navvīne
bhāviṁchi mammelidivi pāḍi diddumaṁṭenu
yevĕlam̐duladonaina nela navvīne