Edurugudurugaa nidi ye me

ఎదురుగుదురుగా నిది యే మే
Language

(॥పల్లవి॥)
ఎదురుగుదురుగా నిది యే మే
పెదవులు గదలఁగఁ బెనఁగీఁ దాను

(॥ఎదు॥)
పక్కున నగఁగాఁ బంతము లాడితి
యెక్కువ తక్కువ లే విందు
ముక్కునఁ దనకే ముంగోపము మరి
తక్కరి రమణుఁడు తగునా తనకు

(॥ఎదు॥)
సొరిదిఁ జూచితే సూడిటు వట్టితి
యిరువగు తగవులు యే విందు
సరుగన తానే సాకిరి చెప్పీ
కెరలినజగడమె గెలుపా తనకు

(॥ఎదు॥)
యీడుకు వచ్చిన నిన్నియు మఱచితి
యిడుగానిపను లే విందు
వేడుకతో శ్రీవేంకటరమణుఁడు
కూడి మొక్కి నిది గుఱుతా తనకు

(||pallavi||)
ĕdurugudurugā nidi ye me
pĕdavulu gadalam̐gam̐ bĕnam̐gīm̐ dānu

(||ĕdu||)
pakkuna nagam̐gām̐ baṁtamu lāḍidi
yĕkkuva takkuva le viṁdu
mukkunam̐ danage muṁgobamu mari
takkari ramaṇum̐ḍu tagunā tanagu

(||ĕdu||)
sŏridim̐ jūside sūḍiḍu vaṭṭidi
yiruvagu tagavulu ye viṁdu
sarugana tāne sāgiri sĕppī
kĕralinajagaḍamĕ gĕlubā tanagu

(||ĕdu||)
yīḍugu vachchina ninniyu maṟasidi
yiḍugānibanu le viṁdu
veḍugado śhrīveṁkaḍaramaṇum̐ḍu
kūḍi mŏkki nidi guṟudā tanagu