Edurugomti valabu lirumelaa nidanigim

ఎదురుకొంటి వలపు లిరుమేలా నితనికిఁ
Language

(॥పల్లవి॥)
ఎదురుకొంటి వలపు లిరుమేలా నితనికిఁ
బొదిగితే సరిచేసి భోగములై మించెనే

(॥॥)
నంటున నాతనితో నే నవ్వితే నీవందుకుఁగా
గొంటరివై పతినేల కొచ్చి చూచేవే
జంటల నిద్దరివిని జాజులుఁ గలువలనై
పెంటలపూజలై కడుఁబిక్కటిల్లీ మేనను

(॥॥)
మక్కువల పతికి నే మరి పాదాలొ త్తితేను
మొక్కలాన నాతనికి మొక్కవచ్చేవే
చిక్కనితామరలునుఁ జిగురులుఁ గూడ పెట్టి
వొక్కట గుదిగుచ్చితే నోపునా యీతఁడు

(॥॥)
యెలమి శ్రీవేంకటేశు నిట్టె నేఁ గాఁగిలించితే
నులివచ్చితోనేల చన్నుల నొత్తేవే
అలమేలుమంగను నేనై నీవు భూసతివై
కలసితేఁ జెప్పఁగొత్తై కతలై నిలిచెనే

(||pallavi||)
ĕdurugŏṁṭi valabu lirumelā nidanigim̐
bŏdigide sarisesi bhogamulai miṁchĕne

(||||)
naṁṭuna nādanido ne navvide nīvaṁdugum̐gā
gŏṁṭarivai padinela kŏchchi sūseve
jaṁṭala niddarivini jājulum̐ galuvalanai
pĕṁṭalabūjalai kaḍum̐bikkaḍillī menanu

(||||)
makkuvala padigi ne mari pādālŏ ttidenu
mŏkkalāna nādanigi mŏkkavachcheve
sikkanidāmaralunum̐ jigurulum̐ gūḍa pĕṭṭi
vŏkkaḍa gudiguchchide nobunā yīdam̐ḍu

(||||)
yĕlami śhrīveṁkaḍeśhu niṭṭĕ nem̐ gām̐giliṁchide
nulivachchidonela sannula nŏtteve
alamelumaṁganu nenai nīvu bhūsadivai
kalasidem̐ jĕppam̐gŏttai kadalai nilisĕne