ఎదురుబడి వలపు లిట్టుండవలదా
(॥పల్లవి॥)
ఎదురుబడి వలపు లిట్టుండవలదా
ముదురుఁ బరువముతో మునుకొనీ నివిగో
(॥ఎదు॥)
సిగ్గులనే తెరవేసి చిరునవ్వుఁదలఁబాలు
అగ్గలము నీపైఁజల్లీ నతివ
వెగ్గళించి నీమై నవి చెమటముత్యాలై
దిగ్గన నలువంకట దిగుపారీనవిగో
(॥ఎదు॥)
తీపుమోవి లిం(విం?) దువెట్టి తెలిగన్నుల తేటల
చూపులవిడేలు వెట్టీసుదతి
పైపై యవే నిమేనఁ బచ్చిపులకమోసులై
మోపులకొలఁదులతో ముంచుకొనీ నవిగో
(॥ఎదు॥)
కాఁగిటనే పీఁటవెట్టి కడురతుల వేడుకఁ
బాఁగుచునుఁ బెండ్లాడీ పడఁతి
చేఁగలై యవే శ్రీవేంకటేశ్వర
దాఁగనిమరుకళలై తమిరేఁచీ నవిగో
(||pallavi||)
ĕdurubaḍi valabu liṭṭuṁḍavaladā
mudurum̐ baruvamudo munugŏnī nivigo
(||ĕdu||)
siggulane tĕravesi sirunavvum̐dalam̐bālu
aggalamu nībaim̐jallī nadiva
vĕggaḽiṁchi nīmai navi sĕmaḍamutyālai
diggana naluvaṁkaḍa digubārīnavigo
(||ĕdu||)
tībumovi liṁ(viṁ?) duvĕṭṭi tĕligannula teḍala
sūbulaviḍelu vĕṭṭīsudadi
paibai yave nimenam̐ bachchibulagamosulai
mobulagŏlam̐dulado muṁchugŏnī navigo
(||ĕdu||)
kām̐giḍane pīm̐ṭavĕṭṭi kaḍuradula veḍugam̐
bām̐gusunum̐ bĕṁḍlāḍī paḍam̐ti
sem̐galai yave śhrīveṁkaḍeśhvara
dām̐ganimarugaḽalai tamirem̐sī navigo