ఎదురుబడి నున్నారు నిద్దరు నేకతమున
(॥పల్లవి॥)
ఎదురుబడి నున్నారు నిద్దరు నేకతమున
అదను చూచి యీడకు నాతని రప్పించవే
(॥ఎదు॥)
సన్నల నాతనితో సరసములాడనీవే
కిన్నెరమీఁటుల గిలిచంచనీవే
విన్నపము లేమైనా వెలఁది చేసుకోనీవే
నన్నేల పిలిచేవు నడుమ నీవాడకు
(॥ఎదు॥)
బత్తిగలిగినట్టాఁ బాదాలు విసుకనీవే
గుత్తవు గుబ్బఁల బతిఁ గుమ్మనీవే
కొత్తగా నవ్వులు నవ్వి కూరిమి గొసరనీవే
పొత్తులకాఁగిటనేల పొదుగుమనేవు
(॥ఎదు॥)
తిరముగా లోలోనే తెరవేసుకోనీవే
గిరికుచములంట భోగించనీవే
అరిది శ్రీవేంకటేశుఁ డాతఁడే నన్నుఁ గూడె
సురతపు రహస్యాలచొప్పు వెదకుదురా
(||pallavi||)
ĕdurubaḍi nunnāru niddaru negadamuna
adanu sūsi yīḍagu nādani rappiṁchave
(||ĕdu||)
sannala nādanido sarasamulāḍanīve
kinnĕramīm̐ṭula gilisaṁchanīve
vinnabamu lemainā vĕlam̐di sesugonīve
nannela pilisevu naḍuma nīvāḍagu
(||ĕdu||)
battigaliginaṭṭām̐ bādālu visuganīve
guttavu gubbam̐la badim̐ gummanīve
kŏttagā navvulu navvi kūrimi gŏsaranīve
pŏttulagām̐giḍanela pŏdugumanevu
(||ĕdu||)
tiramugā lolone tĕravesugonīve
girigusamulaṁṭa bhogiṁchanīve
aridi śhrīveṁkaḍeśhum̐ ḍādam̐ḍe nannum̐ gūḍĕ
suradabu rahasyālasŏppu vĕdagudurā