Edurubadi nunnaaru iddaroo meeru

ఎదురుబడి నున్నారు ఇద్దరూ మీరు
Language

(॥పల్లవి॥)
ఎదురుబడి నున్నారు ఇద్దరూ మీరు
పొదిగి రతుల నిట్టే భోగించుటగాక

(॥ఎదు॥)
సేస వెట్టి పతితోడ సిగ్గువడనేఁటికే
ఆసలెల్లా రేఁగ గోర నంటుటగాక
వాసితోఁ గొసరి తలవంచుకొననేటిఁకే
మోసపొక చేతులెత్తి మొక్కుటగాక

(॥ఎదు॥)
సరుసనే కూచుండి జాగులు మరేఁటికే
బెరసి వలపులెల్లాఁ బెంచుటగాక
సరసములాడి పొద్దు జరపఁగనేఁటికే
సురతభోగాల చవిచూపుటగాక

(॥ఎదు॥)
కనువిచ్చి చూచితయును కాంతలమఱఁగేటికే
ననిచి కాగిటఁగూడి నవ్వుటగాక
యెనసితివి శ్రీవేంకటేశు నింతలో నీవు
మనసిచ్చి యీతనినే మరుగుటగాక

(||pallavi||)
ĕdurubaḍi nunnāru iddarū mīru
pŏdigi radula niṭṭe bhogiṁchuḍagāga

(||ĕdu||)
sesa vĕṭṭi padidoḍa sigguvaḍanem̐ṭige
āsalĕllā rem̐ga gora naṁṭuḍagāga
vāsidom̐ gŏsari talavaṁchugŏnaneḍim̐ke
mosabŏga sedulĕtti mŏkkuḍagāga

(||ĕdu||)
sarusane kūsuṁḍi jāgulu marem̐ṭige
bĕrasi valabulĕllām̐ bĕṁchuḍagāga
sarasamulāḍi pŏddu jarabam̐ganem̐ṭige
suradabhogāla savisūbuḍagāga

(||ĕdu||)
kanuvichchi sūsidayunu kāṁtalamaṟam̐geḍige
nanisi kāgiḍam̐gūḍi navvuḍagāga
yĕnasidivi śhrīveṁkaḍeśhu niṁtalo nīvu
manasichchi yīdanine maruguḍagāga