ఎదురు చూచిచూచి యేఁకారితిని
(॥పల్లవి॥)
ఎదురు చూచిచూచి యేఁకారితిని
యిదివో నీవిట్లానైతే యేమనఁగవచ్చును
(॥ఎదు॥)
పిలిచితే రారాదా ప్రియుఁడను నాకంటా
చెలరేఁగిచెలరేఁగి చెప్పుకొందువు
అలరి యమ్మేదొకటీ నసిమలోదొకటైతే
వెలఁదుల కెటువలె వేగించవచ్చును
(॥ఎదు॥)
చెప్పినట్లు సేయరాదాచేతలోనివాఁడనని
అప్పటకప్పటికి నీవు ఆడుకొందువు
చిప్పిల విత్తొకటిని చెట్టొకటీ నైతేను
తప్పనిసతుల కెట్టుదరియించవచ్చును
(॥ఎదు॥)
చేరి కాఁగిలించరాదా శ్రీవేంకటేశుఁడ నీ
వీరీతిఁ గూడితినవి యెంచుకొందువు
నేరుపరలమేల్మంగ నేనూ నీవూ నొక్కటైతే
ఆరీతికాంతలకెట్లు అవుఁగాదనఁగవచ్చును
(||pallavi||)
ĕduru sūsisūsi yem̐kāridini
yidivo nīviṭlānaide yemanam̐gavachchunu
(||ĕdu||)
piliside rārādā priyum̐ḍanu nāgaṁṭā
sĕlarem̐gisĕlarem̐gi sĕppugŏṁduvu
alari yammedŏgaḍī nasimalodŏgaḍaide
vĕlam̐dula kĕḍuvalĕ vegiṁchavachchunu
(||ĕdu||)
sĕppinaṭlu seyarādāsedalonivām̐ḍanani
appaḍagappaḍigi nīvu āḍugŏṁduvu
sippila vittŏgaḍini sĕṭṭŏgaḍī naidenu
tappanisadula kĕṭṭudariyiṁchavachchunu
(||ĕdu||)
seri kām̐giliṁcharādā śhrīveṁkaḍeśhum̐ḍa nī
vīrīdim̐ gūḍidinavi yĕṁchugŏṁduvu
nerubaralamelmaṁga nenū nīvū nŏkkaḍaide
ārīdigāṁtalagĕṭlu avum̐gādanam̐gavachchunu