Eduru soosidimi yimdaamkaa neegu

ఎదురు చూచితిమి యిందాఁకా నీకు
Language

(॥పల్లవి॥)
ఎదురు చూచితిమి యిందాఁకా నీకు
తుదకెక్కెఁ బనులు సంతోసమాయ నిపుడు

(॥ఎదు॥)
చెలివిన్నపము నీకు చిత్తమునఁ బట్టెనా
వలపులు తారుకాణ వచ్చెనా నేఁడు
పిలిచిన పిలుపులు ప్రియమాయనా నీకు
చెలరేఁగి యింటికి విచ్చేసితి విపుడు

(॥ఎదు॥)
కాఁపురాలుసేయ నీకుఁ గడు వేడుకాయనా
ఆఁపరాని తమకము లాసరేఁచెనా
యేపున నీ వయసు యెచ్చరించెనా నిన్ను
చేపట్టి మా యింటికి విచ్చేసితి విపుడు

(॥ఎదు॥)
సరసపుఁ జేతలు చవు లాయెనా నీకు
నిరతి నీ కన్నకల నిక్కలాయనా
సరుగ శ్రీవేంకటేశ జలజాక్షి నేలితివి
సిరులలో నింటికి విచ్చేసితి విపుడు

(||pallavi||)
ĕduru sūsidimi yiṁdām̐kā nīgu
tudagĕkkĕm̐ banulu saṁtosamāya nibuḍu

(||ĕdu||)
sĕlivinnabamu nīgu sittamunam̐ baṭṭĕnā
valabulu tārugāṇa vachchĕnā nem̐ḍu
pilisina pilubulu priyamāyanā nīgu
sĕlarem̐gi yiṁṭigi vichchesidi vibuḍu

(||ĕdu||)
kām̐purāluseya nīgum̐ gaḍu veḍugāyanā
ām̐parāni tamagamu lāsarem̐sĕnā
yebuna nī vayasu yĕchchariṁchĕnā ninnu
sebaṭṭi mā yiṁṭigi vichchesidi vibuḍu

(||ĕdu||)
sarasabum̐ jedalu savu lāyĕnā nīgu
niradi nī kannagala nikkalāyanā
saruga śhrīveṁkaḍeśha jalajākṣhi nelidivi
sirulalo niṁṭigi vichchesidi vibuḍu