ఎదురు చూచి చూచి యేఁకరినట్టయ్యీని
(॥పల్లవి॥)
ఎదురు చూచి చూచి యేఁకరినట్టయ్యీని
నిదుర గంటికి రాదు నేనిఁక నేమందునే
(॥॥)
వొప్పఁజెప్ప నా చేతివుంగరము తానే యిచ్చె
అప్పటి వచ్చేనంటా నానవెట్టెను
కప్పురపుఁదమ్ములము కందువగా నోర నించె
యెప్పుడుగాని రాఁడో యేమి సేతుఁజెలియా
(॥॥)
కూరిమితో జారిన నాకొప్పు తానె చక్కఁబెట్టె
గారవించి నమ్మించి కాఁగిలించెను
వూరడించి వొకతె నా వద్ద నప్పసము వెట్టె
చేర నెప్పుడు వచ్చీనో చెప్పఁగదే చెలియా
(॥॥)
ఆదరించి చిక్కువడ్డహారములు తానె దిద్ది
పోది సేసి మోవియిచ్చి బుజ్జిగించెను
యీదెస శ్రీ వేంకటేశుఁ డింతలోనె నన్నుఁ గూడె
యేదస నుండెనోకాని ఇందాఁకా జెలియా
(||pallavi||)
ĕduru sūsi sūsi yem̐karinaṭṭayyīni
nidura gaṁṭigi rādu nenim̐ka nemaṁdune
(||||)
vŏppam̐jĕppa nā sedivuṁgaramu tāne yichchĕ
appaḍi vachchenaṁṭā nānavĕṭṭĕnu
kappurabum̐dammulamu kaṁduvagā nora niṁchĕ
yĕppuḍugāni rām̐ḍo yemi sedum̐jĕliyā
(||||)
kūrimido jārina nāgŏppu tānĕ sakkam̐bĕṭṭĕ
gāraviṁchi nammiṁchi kām̐giliṁchĕnu
vūraḍiṁchi vŏgadĕ nā vadda nappasamu vĕṭṭĕ
sera nĕppuḍu vachchīno sĕppam̐gade sĕliyā
(||||)
ādariṁchi sikkuvaḍḍahāramulu tānĕ diddi
podi sesi moviyichchi bujjigiṁchĕnu
yīdĕsa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannum̐ gūḍĕ
yedasa nuṁḍĕnogāni iṁdām̐kā jĕliyā