Eduru soosee neevu yeppudu vattuvo yamtaa

ఎదురు చూచీ నీవు యెప్పుడు వత్తువో యంటా
Language

(॥పల్లవి॥)
ఎదురు చూచీ నీవు యెప్పుడు వత్తువో యంటా
పదఁ గదవే నీతో పాలుపడ్డాఁ డతఁడు

(॥॥)
కొంకక కూడినదాఁకా కొండవంటిది వలపు
అంకెకు వచ్చినదాఁకా నాయమువంటిది చింత
సంకెదేరినందాఁకా చలివంటిది సిగ్గు
యింకా నేఁటికి రానే యీడనున్నాఁ డతఁడు

(॥॥)
మనసు గలయదాఁకా మరులువంటిది తమి
యెనయఁ బిలుచుదాఁకా యేరువంటిది కోరికె
కని మాటాడుదాఁకా చీఁకటివంటిది మోనము
కినియకువే నీవాకిటనున్నాఁ డతఁడు

(॥॥)
సరిఁగఁగిలించుదాఁకా జాలివంటిది వయసు
ధరఁ దలయెత్తుదాఁకా తలుపువంటిది చూపు
ఇరవై శ్రీ వేంకటేశుఁడీడకే విచ్చేసి కూడె
వరు సడుగక రావే వద్దనున్నాఁ డతఁడు

(||pallavi||)
ĕduru sūsī nīvu yĕppuḍu vattuvo yaṁṭā
padam̐ gadave nīdo pālubaḍḍām̐ ḍadam̐ḍu

(||||)
kŏṁkaga kūḍinadām̐kā kŏṁḍavaṁṭidi valabu
aṁkĕgu vachchinadām̐kā nāyamuvaṁṭidi siṁta
saṁkĕderinaṁdām̐kā salivaṁṭidi siggu
yiṁkā nem̐ṭigi rāne yīḍanunnām̐ ḍadam̐ḍu

(||||)
manasu galayadām̐kā maruluvaṁṭidi tami
yĕnayam̐ bilusudām̐kā yeruvaṁṭidi korigĕ
kani māḍāḍudām̐kā sīm̐kaḍivaṁṭidi monamu
kiniyaguve nīvāgiḍanunnām̐ ḍadam̐ḍu

(||||)
sarim̐gam̐giliṁchudām̐kā jālivaṁṭidi vayasu
dharam̐ dalayĕttudām̐kā talubuvaṁṭidi sūbu
iravai śhrī veṁkaḍeśhum̐ḍīḍage vichchesi kūḍĕ
varu saḍugaga rāve vaddanunnām̐ ḍadam̐ḍu