Eduru raanaidinamtaa yela doorevu

ఎదురు రానైతినంటా యేల దూరేవు
Language

(॥పల్లవి॥)
ఎదురు రానైతినంటా యేల దూరేవు
వెదకి తిరుగఁబోతే వెఱ్ఱిదాన ననరా

(॥దురు॥)
తలఁపు దెలిసి కాక దగ్గరి నీతో నాకు
వలసినట్టు పెనఁగ వచ్చునా యీడ
బలిమినె మగవాఁడు పైకొనఁగఁ జెల్లు గాక
చెలి యింత సేయఁ బోతే సిగ్గు లేని దనరా

(॥దురు॥)
తెరమరఁ గుండఁగానె తెగ నీ వలపు చల్లి
వరుస దప్పి నవ్వఁగవచ్చునా నాకు
తరుణితో రమణుఁడు తమకించఁ జెల్లుఁ గాక
మరల నంటె నాఁటది మందెమేళ మనరా

(॥దురు॥)
యీవల నావలనుండి కిట్టె వచ్చే నంటా
వావులు దెలుప నీతో వచ్చునా నాకు
శ్రీవేంకటేశ్వర నీవే చెలిఁ గూడితివి గాక
చేవ మీఱితే నాఁటది చేఁతలాఁడి యనరా

(||pallavi||)
ĕduru rānaidinaṁṭā yela dūrevu
vĕdagi tirugam̐bode vĕṭridāna nanarā

(||duru||)
talam̐pu dĕlisi kāga daggari nīdo nāgu
valasinaṭṭu pĕnam̐ga vachchunā yīḍa
baliminĕ magavām̐ḍu paigŏnam̐gam̐ jĕllu gāga
sĕli yiṁta seyam̐ bode siggu leni danarā

(||duru||)
tĕramaram̐ guṁḍam̐gānĕ tĕga nī valabu salli
varusa dappi navvam̐gavachchunā nāgu
taruṇido ramaṇum̐ḍu tamagiṁcham̐ jĕllum̐ gāga
marala naṁṭĕ nām̐ṭadi maṁdĕmeḽa manarā

(||duru||)
yīvala nāvalanuṁḍi kiṭṭĕ vachche naṁṭā
vāvulu dĕluba nīdo vachchunā nāgu
śhrīveṁkaḍeśhvara nīve sĕlim̐ gūḍidivi gāga
seva mīṟide nām̐ṭadi sem̐talām̐ḍi yanarā