ఎదురు మెచ్చ నీసుద్దులేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎదురు మెచ్చ నీసుద్దులేమి చెప్పేది
కదిసి కొసరఁగాను కాకుసేతురా
(॥॥)
యింతి నీవు మచ్చికతో నేకతములాఁడగాఁ బూ-
బంతిఁగొని వేసి యాకె పంతమాడెను
చెంతనుండి నీవందుకు సిగ్గువడవలెఁగాక
బంతి నుండి నీవు నిమ్మ పంట వేతురా
(॥॥)
బడినే మీరిద్దరును బాసలు చేసుకొనఁగ
నడుమఁ బన్నీరు చల్లి నవ్వీ నాపె
తడబడి నీ వందుకు తల వంచవలెఁ గాక
జడిగొని గందవొడి చల్లఁజొత్తరా
(॥॥)
కమ్మి వొండొరులు మీరు కాఁగిలించుకొనఁగాను
దొమ్మి నాపె నిన్ను గూడి తొక్కెఁ బాదము
యెంమ్మెఁ తో నన్నేలే వందు కిచ్చగించవలెగాక
వుమ్మడి శ్రీవేంకటేశ వుర మెక్కుకుందురా
(||pallavi||)
ĕduru mĕchcha nīsuddulemi sĕppedi
kadisi kŏsaram̐gānu kāgusedurā
(||||)
yiṁti nīvu machchigado negadamulām̐ḍagām̐ bū-
baṁtim̐gŏni vesi yāgĕ paṁtamāḍĕnu
sĕṁtanuṁḍi nīvaṁdugu sigguvaḍavalĕm̐gāga
baṁti nuṁḍi nīvu nimma paṁṭa vedurā
(||||)
baḍine mīriddarunu bāsalu sesugŏnam̐ga
naḍumam̐ bannīru salli navvī nābĕ
taḍabaḍi nī vaṁdugu tala vaṁchavalĕm̐ gāga
jaḍigŏni gaṁdavŏḍi sallam̐jŏttarā
(||||)
kammi vŏṁḍŏrulu mīru kām̐giliṁchugŏnam̐gānu
dŏmmi nābĕ ninnu gūḍi tŏkkĕm̐ bādamu
yĕṁmmĕm̐ to nannele vaṁdu kichchagiṁchavalĕgāga
vummaḍi śhrīveṁkaḍeśha vura mĕkkuguṁdurā