ఎదురు గొసరితేను యేది వలపు
(॥పల్లవి॥)
ఎదురు గొసరితేను యేది వలపు
యెదలోఁ గపట ముంటే నిక నేది వలపు
(॥ఎదురు॥)
కాంత నీతో నలిగితే గడుఁ బ్రియము చెప్పక
యింతలో మా రగిలితే నేది వలపు
సంతానకుఁ జెలి నీతోఁ బలుకక వుండితే
వంతుకు నీవూరకున్న వడి నేది వలపు
(॥ఎదురు॥)
వొంటి మనసు చూడ నువిద రాకుండితేను
యింటికి నీవేఁగకున్న నేది వలపు
అంటకు మంటాఁ జెలి యదలించుకొంటాఁ బోతే
వెంటనే నీవేఁగకున్న వెస సేది వలపు
(॥ఎదురు॥)
సటనలకు నిన్నుఁ జూచి జలజాక్షి దిద్దితేన
యిటు వడి మొక్కుకున్న నేది వలపు
ఘటన శ్రీవేంకటేశ కౌఁగిట గూడితి నాకెఁ
దటుకున మీదే కాక ధర నేది నేది వలపు
(||pallavi||)
ĕduru gŏsaridenu yedi valabu
yĕdalom̐ gabaḍa muṁṭe niga nedi valabu
(||ĕduru||)
kāṁta nīdo naligide gaḍum̐ briyamu sĕppaga
yiṁtalo mā ragilide nedi valabu
saṁtānagum̐ jĕli nīdom̐ balugaga vuṁḍide
vaṁtugu nīvūragunna vaḍi nedi valabu
(||ĕduru||)
vŏṁṭi manasu sūḍa nuvida rāguṁḍidenu
yiṁṭigi nīvem̐gagunna nedi valabu
aṁṭagu maṁṭām̐ jĕli yadaliṁchugŏṁṭām̐ bode
vĕṁṭane nīvem̐gagunna vĕsa sedi valabu
(||ĕduru||)
saḍanalagu ninnum̐ jūsi jalajākṣhi diddidena
yiḍu vaḍi mŏkkugunna nedi valabu
ghaḍana śhrīveṁkaḍeśha kaum̐giḍa gūḍidi nāgĕm̐
daḍuguna mīde kāga dhara nedi nedi valabu