(॥పల్లవి॥)
ఎదురు గొసరితే యేది వలపు
యెదలోఁ గపట ముంటే యిఁక నేది వలపూ
(॥ఎదురు॥)
కాంత నీతో నలిగితే కడుఁ బ్రియము చెప్పక
యింతలో మా రలిగితే నేది వలపూ
పంతానకు చెలి నీతో పలుకక వుండితేను
వంతుల కూరకుండితే యేది వలపూ
(॥ఎదురు॥)
వొంటి నీ మనసు చూడ వువిద యిందు రానంటే
యింటికి నేఁగకుండితే యేది వలపూ
అంటకు మంటాఁ జెలి అదలించు కొంటాఁ బోతే
వెంటఁ దగులకుండితే నెస నేది వలపూ
(॥ఎదురు॥)
సటలకు నినుఁ జూచి జలజాక్షి తిట్టితేను
యిటులా మొక్క కుండితే నేది వలపూ
ఘటన శ్రీవేంకటేశ కౌఁగిటఁ గూడితి వాకె
తటుకున మీకె కాక ధరనేది వలపూ
(||pallavi||)
ĕduru gŏsaride yedi valabu
yĕdalom̐ gabaḍa muṁṭe yim̐ka nedi valabū
(||ĕduru||)
kāṁta nīdo naligide kaḍum̐ briyamu sĕppaga
yiṁtalo mā raligide nedi valabū
paṁtānagu sĕli nīdo palugaga vuṁḍidenu
vaṁtula kūraguṁḍide yedi valabū
(||ĕduru||)
vŏṁṭi nī manasu sūḍa vuvida yiṁdu rānaṁṭe
yiṁṭigi nem̐gaguṁḍide yedi valabū
aṁṭagu maṁṭām̐ jĕli adaliṁchu kŏṁṭām̐ bode
vĕṁṭam̐ dagulaguṁḍide nĕsa nedi valabū
(||ĕduru||)
saḍalagu ninum̐ jūsi jalajākṣhi tiṭṭidenu
yiḍulā mŏkka kuṁḍide nedi valabū
ghaḍana śhrīveṁkaḍeśha kaum̐giḍam̐ gūḍidi vāgĕ
taḍuguna mīgĕ kāga dharanedi valabū