Eduraina maatramuna yenni gadimchugoneene

ఎదురైన మాత్రమున యెన్ని గడించుకొనీనే
Language

(॥పల్లవి॥)
ఎదురైన మాత్రమున యెన్ని గడించుకొనీనే
యిదె మారుమాట నీతో నేమని నే నందునే

(॥ఎదురై॥)
కాంత మగవానెదుట కనురెప్ప వేసినాను
చెంతల నదినో సన్నసేసే నందురు
అంతఁ దప్పక చూచితే నాసపడే నందురు
చింతతోనూరకుండితే చిమ్మిరేఁగె నందురు

(॥ఎదురై॥)
ముంచి చెలితోఁ జెలిముచ్చట లాడితేను
కొంచక తమ్మునే ఆడుకొనీ నందురు
చంచున నూరకుండితే సమ్మతించె నందురు
వంచినచే యెత్తితేను వచ్చే ననే నందురు

(॥ఎదురై॥)
మగువ వేరొకకసతి మాటున నిలిచితేను
జిగిఁదొల్లిటి పొందులసిగ్గు లందురు
అగడై శ్రీవేంకటేశఁ డందులకే నన్చుఁ గూడె
నగుతా ముసుఁ గిడితే ననుపుది యందురు

(||pallavi||)
ĕduraina mātramuna yĕnni gaḍiṁchugŏnīne
yidĕ mārumāḍa nīdo nemani ne naṁdune

(||ĕdurai||)
kāṁta magavānĕduḍa kanurĕppa vesinānu
sĕṁtala nadino sannasese naṁduru
aṁtam̐ dappaga sūside nāsabaḍe naṁduru
siṁtadonūraguṁḍide simmirem̐gĕ naṁduru

(||ĕdurai||)
muṁchi sĕlidom̐ jĕlimuchchaḍa lāḍidenu
kŏṁchaga tammune āḍugŏnī naṁduru
saṁchuna nūraguṁḍide sammadiṁchĕ naṁduru
vaṁchinase yĕttidenu vachche nane naṁduru

(||ĕdurai||)
maguva verŏgagasadi māḍuna nilisidenu
jigim̐dŏlliḍi pŏṁdulasiggu laṁduru
agaḍai śhrīveṁkaḍeśham̐ ḍaṁdulage nanchum̐ gūḍĕ
nagudā musum̐ giḍide nanubudi yaṁduru