Eduraidi middaramu imkelayyaa

ఎదురైతి మిద్దరము ఇంకేలయ్యా
Language

(॥పల్లవి॥)
ఎదురైతి మిద్దరము ఇంకేలయ్యా
కొదవెల్లాఁ దీరఁ జేకొనవయ్యా

(॥ఎదు॥)
వట్టి నేరా లెంచితిని వద్దిఁక మాయింటిదాఁకాఁ
బట్టిన చలము మాని పదవయ్యా
తొట్టిన యానలకెల్లా దోసము లేదనేఁగాని
అట్టె మాతో మాటలాడవయ్యా

(॥ఎదు॥)
సేసినగుంపెనలకు చేతుల మోక్కేఁగాని
ఆసలఁ గప్పురవీడె మందుకోవయ్యా
బాస నిన్నుఁగొన్నందుకు పంతము లిచ్చేఁగాని
వేసాల నీనొప్పులెల్లా వీడవయ్యా

(॥ఎదు॥)
వేమారు దూరినందుకు వేరేచెక్కు నొక్కేఁగాని
నామోము చూచి కొంత నవ్వవయ్యా
కామించి శ్రీవేంకటేశ కైకొని నన్నుఁగూడితి-
నామాటే చెల్లించి అంకెకు రావయ్యా

(||pallavi||)
ĕduraidi middaramu iṁkelayyā
kŏdavĕllām̐ dīram̐ jegŏnavayyā

(||ĕdu||)
vaṭṭi nerā lĕṁchidini vaddim̐ka māyiṁṭidām̐kām̐
baṭṭina salamu māni padavayyā
tŏṭṭina yānalagĕllā dosamu ledanem̐gāni
aṭṭĕ mādo māḍalāḍavayyā

(||ĕdu||)
sesinaguṁpĕnalagu sedula mokkem̐gāni
āsalam̐ gappuravīḍĕ maṁdugovayyā
bāsa ninnum̐gŏnnaṁdugu paṁtamu lichchem̐gāni
vesāla nīnŏppulĕllā vīḍavayyā

(||ĕdu||)
vemāru dūrinaṁdugu veresĕkku nŏkkem̐gāni
nāmomu sūsi kŏṁta navvavayyā
kāmiṁchi śhrīveṁkaḍeśha kaigŏni nannum̐gūḍidi-
nāmāḍe sĕlliṁchi aṁkĕgu rāvayyā