ఎదురాడరాదు నాకు ఇల్లాల నేను
(॥పల్లవి॥)
ఎదురాడరాదు నాకు ఇల్లాల నేను
అదన నెన్నఁడు జాణవయ్యేవో యిఁకను
(॥॥)
కాఁపురము సేసి యాకె కతలెల్లాఁ జెప్పఁగాను
యేపుమీర వింటివి నీవిందాఁ కాను
రేపుమాపు నిట్లానే యేపురేఁగి తిరుగఁగ
చేపట్టి బుద్దు లెవ్వరు చెప్పేరు నీ కిఁకను
(॥॥)
చెలరేఁగి జవరాలు చేరి నిన్ను నవ్వించఁ గా
యెలమి సుకించితివి ఇందాఁకాను
వెలయఁ గ నీవిట్లా వేడుకకాఁడవు గాఁ గా
చెలఁగి సంసారము సేయు టెన్నఁడిఁకను
(॥॥)
విచ్చనవిడి గలికి వేవేలుగాఁ గూడఁ గాను
ఇచ్చగించి నేర్చితివి ఇందాఁ కాను
మచ్చిక శ్రీ వేంకటేశ మరి నన్ను నేలితివి
తచ్చివే సిద్దరిమేలు తలఁచేవు యిఁకను
(||pallavi||)
ĕdurāḍarādu nāgu illāla nenu
adana nĕnnam̐ḍu jāṇavayyevo yim̐kanu
(||||)
kām̐puramu sesi yāgĕ kadalĕllām̐ jĕppam̐gānu
yebumīra viṁṭivi nīviṁdām̐ kānu
rebumābu niṭlāne yeburem̐gi tirugam̐ga
sebaṭṭi buddu lĕvvaru sĕpperu nī kim̐kanu
(||||)
sĕlarem̐gi javarālu seri ninnu navviṁcham̐ gā
yĕlami sugiṁchidivi iṁdām̐kānu
vĕlayam̐ ga nīviṭlā veḍugagām̐ḍavu gām̐ gā
sĕlam̐gi saṁsāramu seyu ṭĕnnam̐ḍim̐kanu
(||||)
vichchanaviḍi galigi vevelugām̐ gūḍam̐ gānu
ichchagiṁchi nersidivi iṁdām̐ kānu
machchiga śhrī veṁkaḍeśha mari nannu nelidivi
tachchive siddarimelu talam̐sevu yim̐kanu