Edura needam dumdamgaa nidemammaa

ఎదుర నీతఁ డుండఁగా నిదేమమ్మా
Language

(॥పల్లవి॥)
ఎదుర నీతఁ డుండఁగా నిదేమమ్మా
పొదిగి నీ కూటమికే పూఁచుకున్నాఁడితఁడు

(॥ఎదు॥)
చెక్కుచే యిదేఁటికమ్మా సిగ్గువడ నేఁటికమ్మా
అక్కరతో మగఁడు మాఁటాడఁగాను
చక్కఁ జూడఁ గదవమ్మా సరసము లాడవమ్మా
గక్కన నీరతులకే కాచుకున్నాఁ డితఁడు

(॥ఎదు॥)
శిరసు వంచనేలమ్మా సెలవి నవ్వ నేలమ్మా
బెరసి విభుఁడు మితోఁ బెనఁగఁగాను
తెరదియ్యఁ గదవమ్మా తెచ్చి విడేమియ్యవమ్మా
పరగ నీకే బతిమి పట్టుకున్నాఁడితఁడు

(॥ఎదు॥)
వూరకుండనేలమ్మా వొడ్డుకొన నేలమ్మా
చేరి శ్రీవేంకటేశుఁడు చెనకఁగాను
గారవించఁ గదమ్మా కడు సంతోసించవమ్మా
కూరిమి నీరతులకే కోరుకున్నాఁ డితఁడు

(||pallavi||)
ĕdura nīdam̐ ḍuṁḍam̐gā nidemammā
pŏdigi nī kūḍamige pūm̐sugunnām̐ḍidam̐ḍu

(||ĕdu||)
sĕkkuse yidem̐ṭigammā sigguvaḍa nem̐ṭigammā
akkarado magam̐ḍu mām̐ṭāḍam̐gānu
sakkam̐ jūḍam̐ gadavammā sarasamu lāḍavammā
gakkana nīradulage kāsugunnām̐ ḍidam̐ḍu

(||ĕdu||)
śhirasu vaṁchanelammā sĕlavi navva nelammā
bĕrasi vibhum̐ḍu midom̐ bĕnam̐gam̐gānu
tĕradiyyam̐ gadavammā tĕchchi viḍemiyyavammā
paraga nīge badimi paṭṭugunnām̐ḍidam̐ḍu

(||ĕdu||)
vūraguṁḍanelammā vŏḍḍugŏna nelammā
seri śhrīveṁkaḍeśhum̐ḍu sĕnagam̐gānu
gāraviṁcham̐ gadammā kaḍu saṁtosiṁchavammā
kūrimi nīradulage korugunnām̐ ḍidam̐ḍu