ఏదుముల్లు చెంచెతా ఏఁటికే యింతా
(॥పల్లవి॥)
ఏదుముల్లు చెంచెతా ఏఁటికే యింతా
వాదులకు నీవు రాకు వద్దు వద్దు ఇఁకను
(॥ఏదు॥)
వీఁకవింటి చెంచెతా వీఁచి కోసేవేఁటివే
వోఁకలవిడేలువో వొగరుగాని
ఆఁకపొలముగదే అందుకు లోనైతివే
యేఁకటైతేఁ జాలుఁగాని యేరుకోరా నీవును
(॥ఏదు॥)
పీలిచుంగుచెంచెతా పేరు లవి యేఁటివే
వోలి నవి జీడివివో వొమ్మవు గాని
చాలి నాకు నియ్యఁగదే చవిగొన నోపుదును
యేలరా తొల్లె ఇవి యెంగిలాయఁగదరా
(॥ఏదు॥)
మోవితేనె చెంచెతా మొగిఁ బూసేదేఁటికే
కావిరాతిగందము వో కాఁకవుఁగాని
నీవు నన్నుఁ గూడితివి నీసొబగు నాకు నంటె
శ్రీ వేంకటేశ్వర చిక్కులింకా నేలరా
(||pallavi||)
edumullu sĕṁchĕdā em̐ṭige yiṁtā
vādulagu nīvu rāgu vaddu vaddu im̐kanu
(||edu||)
vīm̐kaviṁṭi sĕṁchĕdā vīm̐si kosevem̐ṭive
vom̐kalaviḍeluvo vŏgarugāni
ām̐kabŏlamugade aṁdugu lonaidive
yem̐kaḍaidem̐ jālum̐gāni yerugorā nīvunu
(||edu||)
pīlisuṁgusĕṁchĕdā peru lavi yem̐ṭive
voli navi jīḍivivo vŏmmavu gāni
sāli nāgu niyyam̐gade savigŏna nobudunu
yelarā tŏllĕ ivi yĕṁgilāyam̐gadarā
(||edu||)
movidenĕ sĕṁchĕdā mŏgim̐ būsedem̐ṭige
kāvirādigaṁdamu vo kām̐kavum̐gāni
nīvu nannum̐ gūḍidivi nīsŏbagu nāgu naṁṭĕ
śhrī veṁkaḍeśhvara sikkuliṁkā nelarā