ఎదుటికి రాఁగదవే యిట్టె నిన్ను మెచ్చేను
(॥పల్లవి॥)
ఎదుటికి రాఁగదవే యిట్టె నిన్ను మెచ్చేను
పొదిగొన నీ నేరుపు పొగడేను నేను
(॥ఎదు॥)
సలిగేలే మెరసేవు చనవులకే వచ్చేవు
నలి విభుఁగు నీతోను నవ్వెనంటాను
యెలమి నాతోఁ జెప్పవే యెంత గద్దో నీపగటు
వెలియఁగాఁ జెవులార వినేఁగాని
(॥ఎదు॥)
సాటులకే పెనఁగవు సారె వావులు చెప్పేవు
సూటిగా నిన్నీతఁ డిట్టె చూచె నంటాను
పాటించి నాముందరను పచారించవే నీయెమ్మె
తేటలుగా నీ గుట్టు తెలిసేఁగాని
(॥ఎదు॥)
వంతులకే తగిలేవు వాసులెల్లా నెరపేవు
యింతలో శ్రీవేంకటేశుఁడేలెనంటాను
మంతుకెక్క నన్నీతఁడు మన్నించినాఁడు తొల్లె
సంతోస మెరిఁగించవే సమ్మతించేఁ గాని
(||pallavi||)
ĕduḍigi rām̐gadave yiṭṭĕ ninnu mĕchchenu
pŏdigŏna nī nerubu pŏgaḍenu nenu
(||ĕdu||)
saligele mĕrasevu sanavulage vachchevu
nali vibhum̐gu nīdonu navvĕnaṁṭānu
yĕlami nādom̐ jĕppave yĕṁta gaddo nībagaḍu
vĕliyam̐gām̐ jĕvulāra vinem̐gāni
(||ĕdu||)
sāḍulage pĕnam̐gavu sārĕ vāvulu sĕppevu
sūḍigā ninnīdam̐ ḍiṭṭĕ sūsĕ naṁṭānu
pāḍiṁchi nāmuṁdaranu pasāriṁchave nīyĕmmĕ
teḍalugā nī guṭṭu tĕlisem̐gāni
(||ĕdu||)
vaṁtulage tagilevu vāsulĕllā nĕrabevu
yiṁtalo śhrīveṁkaḍeśhum̐ḍelĕnaṁṭānu
maṁtugĕkka nannīdam̐ḍu manniṁchinām̐ḍu tŏllĕ
saṁtosa mĕrim̐giṁchave sammadiṁchem̐ gāni