ఎదుటనున్నాఁ డతఁడు ఇదివో నా భాగ్యమున
(॥పల్లవి॥)
ఎదుటనున్నాఁ డతఁడు ఇదివో నా భాగ్యమున
పొదిగొనీ వేడుకలు పొంచి యేమి సేతునే
(॥ఎదు॥)
మొగము చూచేనంటే ముప్పిరిగొనీ సిగ్గులు
నగితే మందెమేళాలు నానుకొనీని
తగిలి పెనఁగేనంటే తతిగొనీఁ బులకలు
ఇగిలించీ నాకోరిక లిఁక నేమి సేతునే
(॥ఎదు॥)
విరుల వేసేనంటే వెస నాకు దయవుట్టీ
సరి గాఁగిలించేనంటే చన్ను లొత్తీని
మరిగించుకొనేనంటే మగనితో గర్వమయ్యీ
నిరతి నాగుణమిది నేనేమి సేతునే
(॥ఎదు॥)
కడురతిఁ గూడేనంటే కరఁగీ నాతని మతి
తొడపై నుంటే పాదముతుద దాఁకీని
యెడయక శ్రీ వేంకటేశుఁ డిట్టె నన్నుఁగూడె
తడఁబడీ నాయాసలు దాని కేమిసేతునే
(||pallavi||)
ĕduḍanunnām̐ ḍadam̐ḍu idivo nā bhāgyamuna
pŏdigŏnī veḍugalu pŏṁchi yemi sedune
(||ĕdu||)
mŏgamu sūsenaṁṭe muppirigŏnī siggulu
nagide maṁdĕmeḽālu nānugŏnīni
tagili pĕnam̐genaṁṭe tadigŏnīm̐ bulagalu
igiliṁchī nāgoriga lim̐ka nemi sedune
(||ĕdu||)
virula vesenaṁṭe vĕsa nāgu dayavuṭṭī
sari gām̐giliṁchenaṁṭe sannu lŏttīni
marigiṁchugŏnenaṁṭe maganido garvamayyī
niradi nāguṇamidi nenemi sedune
(||ĕdu||)
kaḍuradim̐ gūḍenaṁṭe karam̐gī nādani madi
tŏḍabai nuṁṭe pādamududa dām̐kīni
yĕḍayaga śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐gūḍĕ
taḍam̐baḍī nāyāsalu dāni kemisedune