ఎదుటనే నన్నుఁ జూచి యేల లోఁగేవు
(॥పల్లవి॥)
ఎదుటనే నన్నుఁ జూచి యేల లోఁగేవు
కదిమి నిన్నెప్పుడైనాఁ గాకు సేసేనా
(॥ఎదు॥)
చెలిమి సేసిన యాపె చెట్టవట్టి తీసితేను
బలిమిఁ బెనఁగుదురా పలుమారును
నెలఁతనింతే నేను నీకేల వట్టివెరపు
చెలఁగి యెక్కడనైనాఁ జెప్పేనా నేను
(॥ఎదు॥)
చుట్టిరికమైన యాపె సుద్దులు నీకుఁ జెప్పఁగా
నట్టు నిట్టుఁ బరాకులౌదురా నీవు
పట్టపువనితనింతే భావము దాఁచఁగనేల
ఱట్టు సేసేనా నిన్ను యిట్టె రచ్చలను
(॥ఎదు॥)
పొందులు సేసిన యాపె పొదిగి నిన్నుఁ గూడఁగ
చెంది సిగ్గువడుదురా శ్రీ వేంకటేశ
అంది నీకాఁగిటిదాన ననుమాన మిఁకనేల
నిందలాడేనా నిన్ను నీసతులలోనను
(||pallavi||)
ĕduḍane nannum̐ jūsi yela lom̐gevu
kadimi ninnĕppuḍainām̐ gāgu sesenā
(||ĕdu||)
sĕlimi sesina yābĕ sĕṭṭavaṭṭi tīsidenu
balimim̐ bĕnam̐gudurā palumārunu
nĕlam̐taniṁte nenu nīgela vaṭṭivĕrabu
sĕlam̐gi yĕkkaḍanainām̐ jĕppenā nenu
(||ĕdu||)
suṭṭirigamaina yābĕ suddulu nīgum̐ jĕppam̐gā
naṭṭu niṭṭum̐ barāgulaudurā nīvu
paṭṭabuvanidaniṁte bhāvamu dām̐sam̐ganela
ṟaṭṭu sesenā ninnu yiṭṭĕ rachchalanu
(||ĕdu||)
pŏṁdulu sesina yābĕ pŏdigi ninnum̐ gūḍam̐ga
sĕṁdi sigguvaḍudurā śhrī veṁkaḍeśha
aṁdi nīgām̐giḍidāna nanumāna mim̐kanela
niṁdalāḍenā ninnu nīsadulalonanu