ఎదుట నున్నది యీపె యెడమాటలాడే నేను
(॥పల్లవి॥)
ఎదుట నున్నది యీపె యెడమాటలాడే నేను
యెదఁ గపటముమాని యేమనేవయ్యా
(॥ఎదు॥)
చెలిమిసేయ నేరక సిగ్గులువడీ నింతి
పలుకనేరక నిన్నుఁ బాడీ నిదె
వలపుచల్లనేరక వద్దనే కాచుకున్నది
యెలమి నిందుకు మరి మేమనేవయ్యా
(॥ఎదు॥)
వొత్తి పిలువనేరక వొడివట్టుకొనీ నింతి
బత్తులు సేయనేరక పైకొనీ నిదె
తత్తరించనేరక తప్పక చూచీ నట్టె
యెత్తినమదాన మరి యేమనేవయ్యా
(॥ఎదు॥)
కతలు చెప్పనేరక కాఁగిలించుకోనీ నింతి
మతకములు నేరక మలసీ నిదె
రతుల శ్రీవేంకటేశ రమించితి వీపె నిట్టె
యితవాయ నిఁక మరి యేవనేవయ్యా
(||pallavi||)
ĕduḍa nunnadi yībĕ yĕḍamāḍalāḍe nenu
yĕdam̐ gabaḍamumāni yemanevayyā
(||ĕdu||)
sĕlimiseya neraga sigguluvaḍī niṁti
paluganeraga ninnum̐ bāḍī nidĕ
valabusallaneraga vaddane kāsugunnadi
yĕlami niṁdugu mari memanevayyā
(||ĕdu||)
vŏtti piluvaneraga vŏḍivaṭṭugŏnī niṁti
battulu seyaneraga paigŏnī nidĕ
tattariṁchaneraga tappaga sūsī naṭṭĕ
yĕttinamadāna mari yemanevayyā
(||ĕdu||)
kadalu sĕppaneraga kām̐giliṁchugonī niṁti
madagamulu neraga malasī nidĕ
radula śhrīveṁkaḍeśha ramiṁchidi vībĕ niṭṭĕ
yidavāya nim̐ka mari yevanevayyā