ఎదుట నున్నాఁడు వీఁడె ఇఁక నేఁటిదే
(॥పల్లవి॥)
ఎదుట నున్నాఁడు వీఁడె ఇఁక నేఁటిదే
వుదుదు(టు?) సిగ్గులు దొట్టీ నుపమ యెక్కడిదే
(॥ఎదు॥)
సన్న సేసి పిలిచీని సరసుఁడు వాఁడె తొల్లి
యెన్నఁడూ మాటాడుతఁలే దేమందునే
కన్నుల మొక్కులు మొక్కెఁ గప్పురము నా కంపె
యెన్ని ప్రియములు సేసి నేమిసేతునె
(॥ఎదు॥)
తోరపునవ్వు నవ్వీ దొరపాటివాఁడు తా-
నేరీతిఁ జిత్త మెఱఁగ నిఁక నేఁటిదే
నారుకొనఁ జూపు చూచీ నను పెన్నఁడూ లేదు
కోరినరతుల కిఁకఁ గొన మొద లెట్టిదే
(॥ఎదు॥)
పానుపుమీఁదికిఁ దీసీం బైఁ దనగుణము గాన
మేనుమేను సోఁకితేను మెచ్చుటేఁటి దే
యీనెపాన శ్రీవేంకటేశుఁ డింత సేసి కూడె
మోనమున వావులెంచి మొఱఁగమ జోటేదే
(||pallavi||)
ĕduḍa nunnām̐ḍu vīm̐ḍĕ im̐ka nem̐ṭide
vududu(ṭu?) siggulu dŏṭṭī nubama yĕkkaḍide
(||ĕdu||)
sanna sesi pilisīni sarasum̐ḍu vām̐ḍĕ tŏlli
yĕnnam̐ḍū māḍāḍudam̐le demaṁdune
kannula mŏkkulu mŏkkĕm̐ gappuramu nā kaṁpĕ
yĕnni priyamulu sesi nemisedunĕ
(||ĕdu||)
torabunavvu navvī dŏrabāḍivām̐ḍu tā-
nerīdim̐ jitta mĕṟam̐ga nim̐ka nem̐ṭide
nārugŏnam̐ jūbu sūsī nanu pĕnnam̐ḍū ledu
korinaradula kim̐kam̐ gŏna mŏda lĕṭṭide
(||ĕdu||)
pānubumīm̐digim̐ dīsīṁ baim̐ danaguṇamu gāna
menumenu som̐kidenu mĕchchuḍem̐ṭi de
yīnĕbāna śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi kūḍĕ
monamuna vāvulĕṁchi mŏṟam̐gama joḍede