Eduda numdina vaarinela doorevu

ఎదుట నుండిన వారినేల దూరేవు
Language

(॥పల్లవి॥)
ఎదుట నుండిన వారినేల దూరేవు
పదియారువేలవారిఁ బంగించవే

(॥ఎదు॥)
చూపుల నాతని దిక్కు చూచితేనే కోపించేవు
కాపురాలు సేసేవారి గానవటే
పైపై నే మాఁటాడితే పదరేవు యలుగులు
చాఁపేటి గొల్లెతలను సాదించవే

(॥ఎదు॥)
నడుమ వినోదాలు నవ్వితేనే గోణఁగేవు
కడనుండి పొందేవారిఁ గానవటే
తడవితినంటా నాపైఁ దమకించే వింతలోన
యెడపుల పువ్వులాపె నీడువెట్టుకోవే

(॥ఎదు॥)
శ్రీ వేంకటేశ్వరు సేవ సేసితేనే పెనఁగేవు
కావరించివుండేవారిఁ గానవటే
యీవేళ నాతఁడే కూడె యిద్దరిని వొక్కమాఁటే
నీవంటివారినే నేరమెంచవే

(||pallavi||)
ĕduḍa nuṁḍina vārinela dūrevu
padiyāruvelavārim̐ baṁgiṁchave

(||ĕdu||)
sūbula nādani dikku sūsidene kobiṁchevu
kāburālu sesevāri gānavaḍe
paibai ne mām̐ṭāḍide padarevu yalugulu
sām̐peḍi gŏllĕdalanu sādiṁchave

(||ĕdu||)
naḍuma vinodālu navvidene goṇam̐gevu
kaḍanuṁḍi pŏṁdevārim̐ gānavaḍe
taḍavidinaṁṭā nābaim̐ damagiṁche viṁtalona
yĕḍabula puvvulābĕ nīḍuvĕṭṭugove

(||ĕdu||)
śhrī veṁkaḍeśhvaru seva sesidene pĕnam̐gevu
kāvariṁchivuṁḍevārim̐ gānavaḍe
yīveḽa nādam̐ḍe kūḍĕ yiddarini vŏkkamām̐ṭe
nīvaṁṭivārine neramĕṁchave