ఎదుట నూరకే వుండి యేమి గట్టుకొంటివి
(॥పల్లవి॥)
ఎదుట నూరకే వుండి యేమి గట్టుకొంటివి
సదరాన వలపులు చవిచూపరాదా
(॥॥)
పూనిననీచన్నులె పోఁడైన నిమ్మపండ్లు
కానుక వట్టఁగరాదా కాంతునికి
తేనెగారేపెదవిపై తీయనినీమాటలు
వీనులలరఁగ నిట్టె విందు సేయఁగరాదా
(॥॥)
సెలవులనవ్వులే చేరఁ డేసికప్పురాలు
వులుపా వట్టఁగరాదా వొగిఁ బతికి
తలకొన్న నీచేతులు తామరలవంటివి
పొలుపొందఁ బాదాలొత్తి పూజసేయరాదా
(॥॥)
ముప్పిరినీకాఁగిలే ముంగిటినిధానము
కప్ప మియ్యరాదా శ్రీ వేంకటపతికి
అప్పసము నీచెక్కులే అద్దములవంటివి
తప్పక చూపి కూడితి తమిరేఁచరాదా
(||pallavi||)
ĕduḍa nūrage vuṁḍi yemi gaṭṭugŏṁṭivi
sadarāna valabulu savisūbarādā
(||||)
pūninanīsannulĕ pom̐ḍaina nimmabaṁḍlu
kānuga vaṭṭam̐garādā kāṁtunigi
tenĕgārebĕdavibai tīyaninīmāḍalu
vīnulalaram̐ga niṭṭĕ viṁdu seyam̐garādā
(||||)
sĕlavulanavvule seram̐ ḍesigappurālu
vulubā vaṭṭam̐garādā vŏgim̐ badigi
talagŏnna nīsedulu tāmaralavaṁṭivi
pŏlubŏṁdam̐ bādālŏtti pūjaseyarādā
(||||)
muppirinīgām̐gile muṁgiḍinidhānamu
kappa miyyarādā śhrī veṁkaḍabadigi
appasamu nīsĕkkule addamulavaṁṭivi
tappaga sūbi kūḍidi tamirem̐sarādā