ఏదియుఁ గానఁడు (గాననందు?) నేది గాదందు
(॥పల్లవి॥)
ఏదియుఁ గానఁడు (గాననందు?) నేది గాదందు
ఆదిపురుష నీ దాస్యమే చాల నాకు
(॥ఏదియు॥)
గరిమఁ గొందరికి సాకారమై నిలిచితి
గురునిరాకారమై కొందరికి
సరుసఁ గొందరికెల్లా సగుణుఁడవట నీవు
ధర నిర్గుణమవట తగిలి కొందరికి
(॥ఏదియు॥)
వొకటఁ గళాపూర్తి నొనరియుందువట
వొకట నిష్కళుఁడవై వుడివోవట
వొకచో జీవుల నీకొరయ భేదమట
వొకచో నె భేదమట వున్నారట నీకు
(॥ఏదియు॥)
అదన నిందరిలోన నంతరాత్ముఁడవట
యెదుట శ్రీవేంకటేశుఁడవట
యిదియిది యననేల యింతయును నీ మహిమ
కదిసి నీ పాదాలే కనుఁగొంటగాక
(||pallavi||)
ediyum̐ gānam̐ḍu (gānanaṁdu?) nedi gādaṁdu
ādiburuṣha nī dāsyame sāla nāgu
(||ediyu||)
garimam̐ gŏṁdarigi sāgāramai nilisidi
gurunirāgāramai kŏṁdarigi
sarusam̐ gŏṁdarigĕllā saguṇum̐ḍavaḍa nīvu
dhara nirguṇamavaḍa tagili kŏṁdarigi
(||ediyu||)
vŏgaḍam̐ gaḽābūrdi nŏnariyuṁduvaḍa
vŏgaḍa niṣhkaḽum̐ḍavai vuḍivovaḍa
vŏgaso jīvula nīgŏraya bhedamaḍa
vŏgaso nĕ bhedamaḍa vunnāraḍa nīgu
(||ediyu||)
adana niṁdarilona naṁtarātmum̐ḍavaḍa
yĕduḍa śhrīveṁkaḍeśhum̐ḍavaḍa
yidiyidi yananela yiṁtayunu nī mahima
kadisi nī pādāle kanum̐gŏṁṭagāga