Edirivaari manasu leṟamgavaddaa

ఎదిరివారి మనసు లెఱఁగవద్దా
Language

(॥పల్లవి॥)
ఎదిరివారి మనసు లెఱఁగవద్దా
యెదుగా సతులఁ దాను యేలేవాఁడు గాఁడా

(॥॥)
యెలమి నాచింతతోడ యెవ్వరి తెరువుఁ బోక
తలవంచుకుండఁగాను తడవుదురా
వలచినవాఁడు తాను వచ్చి వచ్చి రాకుండితే
నలుగరాదా అట్టే ఆఱడిఁ బెట్టుదురా

(॥॥)
అగ్గలపు దమకాన నంటఁగాక వుండి నేను
సిగ్గువడి మొక్కఁగాను చెనకుదురా
వొగ్గి తా వేడుకకాఁడు వూరసుద్దులు చెప్పఁగా-
నెగ్గులు వట్టఁగరాదా ఇంతరట్టు గలదా

(॥॥)
కామించిన కోరికెతో కన్నులఁ దప్పక చూచి
ప్రేమ నుండఁగాఁ జేవట్టి పెనఁగుదురా
యీమేర శ్రీవేంకటేశుఁడిట్టే తానె నన్నుఁగూడె
మోము చూడరాదా నాకుముంచి తానవ్వుదురా

(||pallavi||)
ĕdirivāri manasu lĕṟam̐gavaddā
yĕdugā sadulam̐ dānu yelevām̐ḍu gām̐ḍā

(||||)
yĕlami nāsiṁtadoḍa yĕvvari tĕruvum̐ boga
talavaṁchuguṁḍam̐gānu taḍavudurā
valasinavām̐ḍu tānu vachchi vachchi rāguṁḍide
nalugarādā aṭṭe āṟaḍim̐ bĕṭṭudurā

(||||)
aggalabu damagāna naṁṭam̐gāga vuṁḍi nenu
sigguvaḍi mŏkkam̐gānu sĕnagudurā
vŏggi tā veḍugagām̐ḍu vūrasuddulu sĕppam̐gā-
nĕggulu vaṭṭam̐garādā iṁtaraṭṭu galadā

(||||)
kāmiṁchina korigĕdo kannulam̐ dappaga sūsi
prema nuṁḍam̐gām̐ jevaṭṭi pĕnam̐gudurā
yīmera śhrīveṁkaḍeśhum̐ḍiṭṭe tānĕ nannum̐gūḍĕ
momu sūḍarādā nāgumuṁchi tānavvudurā