Edirim dannerumgamdu yevvamde veemdu

ఎదిరిఁ దన్నెరుఁగఁడు యెవ్వఁడే వీఁడు
Language

(॥పల్లవి॥)
ఎదిరిఁ దన్నెరుఁగఁడు యెవ్వఁడే వీఁడు
గుది గుచ్చీ వలపు కూళటవే వీఁడు

(॥ఎదిరిఁ॥)
వొళ్లు నొచ్చీననఁగానే వొడి వట్టితీసీని
యెల్లవారుఁ జూడఁగాను యెడ్డఁడా వీఁడు
పల్లదాన నేఁ దిట్టిన పకపక నవ్వీని
వెల్లవిరిగాఁ గడు వెఱ్ఱటవే వీఁడు

(॥ఎదిరిఁ॥)
పనిగలదనఁగానే పయ్యదలోఁ జెయి చాఁచీ
తనుఁదానె చలపాదితనమా వీఁడు
కినిసి యాన వెట్టిన కిందుపడి మొక్కీని
మనిమని పెనుగొల్లమంకటవే వీఁడు

(॥ఎదిరిఁ॥)
వద్దని ములుగఁగానే వచ్చి తాఁ గాఁగిటఁ గూడీ
గద్దరి శ్రీవేంకటాద్రి ఘనుఁడే వీఁడు
పొద్దువోయ చాలునన్నఁ బోనీక పెనఁగీని
సుద్దులనే బ్రమయించేజూటటవే వీఁడు

(||pallavi||)
ĕdirim̐ dannĕrum̐gam̐ḍu yĕvvam̐ḍe vīm̐ḍu
gudi guchchī valabu kūḽaḍave vīm̐ḍu

(||ĕdirim̐||)
vŏḽlu nŏchchīnanam̐gāne vŏḍi vaṭṭidīsīni
yĕllavārum̐ jūḍam̐gānu yĕḍḍam̐ḍā vīm̐ḍu
palladāna nem̐ diṭṭina pagabaga navvīni
vĕllavirigām̐ gaḍu vĕṭraḍave vīm̐ḍu

(||ĕdirim̐||)
panigaladanam̐gāne payyadalom̐ jĕyi sām̐sī
tanum̐dānĕ salabādidanamā vīm̐ḍu
kinisi yāna vĕṭṭina kiṁdubaḍi mŏkkīni
manimani pĕnugŏllamaṁkaḍave vīm̐ḍu

(||ĕdirim̐||)
vaddani mulugam̐gāne vachchi tām̐ gām̐giḍam̐ gūḍī
gaddari śhrīveṁkaḍādri ghanum̐ḍe vīm̐ḍu
pŏdduvoya sālunannam̐ bonīga pĕnam̐gīni
suddulane bramayiṁchejūḍaḍave vīm̐ḍu