ఎదిరిఁ దన్నెరఁగని దేఁటియాఁటది
(॥పల్లవి॥)
ఎదిరిఁ దన్నెరఁగని దేఁటియాఁటది
కది సేవు వలపుల కలగంప గలఁదా
(॥॥)
కూరమి నావద్ద వచ్చి కూచుండినపతితోను
సారెసారెఁ గొసరితే చవి వుట్టునా
నారుకొన నాతోను నవ్వు లితఁడు నవ్వఁగ
చేరి చెనకే వెంత చిత్తణివే నీవు
(॥॥)
మందలించి నాతోను మాఁటలాడఁగానే నీవు
సందుసుడిఁ గత చెప్ప సంగతే యిది
కందువ నాతఁడు నన్నుఁ గాఁగిలించుకుండఁగాను
అంది విడేలిచ్చే వెంతాయాసోదకత్తెవే
(॥॥)
శ్రీ వేంకటేశుఁడు నేనూఁ జేరి తెరలో నుండఁగా
సేవలకు దగ్గరేవు చెల్లదే నీకు
కైవశమై నాకితఁడు గలసిమెలశుండఁగా
నీవుఁ జెప్పుకొనే వేఁటినేరుపరివే
(||pallavi||)
ĕdirim̐ dannĕram̐gani dem̐ṭiyām̐ṭadi
kadi sevu valabula kalagaṁpa galam̐dā
(||||)
kūrami nāvadda vachchi kūsuṁḍinabadidonu
sārĕsārĕm̐ gŏsaride savi vuṭṭunā
nārugŏna nādonu navvu lidam̐ḍu navvam̐ga
seri sĕnage vĕṁta sittaṇive nīvu
(||||)
maṁdaliṁchi nādonu mām̐ṭalāḍam̐gāne nīvu
saṁdusuḍim̐ gada sĕppa saṁgade yidi
kaṁduva nādam̐ḍu nannum̐ gām̐giliṁchuguṁḍam̐gānu
aṁdi viḍelichche vĕṁtāyāsodagattĕve
(||||)
śhrī veṁkaḍeśhum̐ḍu nenūm̐ jeri tĕralo nuṁḍam̐gā
sevalagu daggarevu sĕllade nīgu
kaivaśhamai nāgidam̐ḍu galasimĕlaśhuṁḍam̐gā
nīvum̐ jĕppugŏne vem̐ṭinerubarive