Ediri ninnemchugovu yemee neevu

ఎదిరి నిన్నెంచుకోవు యేమీ నీవు
Language

(॥పల్లవి॥)
ఎదిరి నిన్నెంచుకోవు యేమీ నీవు
కదిసి వుండినవారిఁ గైకొనవచ్చేవు

(॥ఎది॥)
తఱగరివానివలె తచ్చితచ్చి మాఁటాడేవు
యెఱఁగవా నాగుణ మింతకతొల్లి
మెఱసేసతులరతి మిక్కిలి బేరములాడి
కొఱతలేనివారిఁ గొసరవచ్చేవు

(॥ఎది॥)
తగవరివలెనే తతిగొని యడిగేవు
పగటు దెలియవా నాభావపు(ము?) నీవు
అగపడినయింతుల అలుకలు దిద్దిదిద్ది
వొగరులేనివారి నొరయవచ్చేవు

(॥ఎది॥)
చుట్టపువానివలె చూచి కాఁగిలించేవు
దిట్టతన మెఱఁగవా దేవుల నేను
యిట్టె శ్రీవేంకటేశ యిటు ని(న?) న్నుఁ గూడికూడి
మట్టులేనివారిని మరుపవచ్చేవు

(||pallavi||)
ĕdiri ninnĕṁchugovu yemī nīvu
kadisi vuṁḍinavārim̐ gaigŏnavachchevu

(||ĕdi||)
taṟagarivānivalĕ tachchidachchi mām̐ṭāḍevu
yĕṟam̐gavā nāguṇa miṁtagadŏlli
mĕṟasesadularadi mikkili beramulāḍi
kŏṟadalenivārim̐ gŏsaravachchevu

(||ĕdi||)
tagavarivalĕne tadigŏni yaḍigevu
pagaḍu dĕliyavā nābhāvabu(mu?) nīvu
agabaḍinayiṁtula alugalu diddididdi
vŏgarulenivāri nŏrayavachchevu

(||ĕdi||)
suṭṭabuvānivalĕ sūsi kām̐giliṁchevu
diṭṭadana mĕṟam̐gavā devula nenu
yiṭṭĕ śhrīveṁkaḍeśha yiḍu ni(na?) nnum̐ gūḍigūḍi
maṭṭulenivārini marubavachchevu