Edigi vegirabade vibudu neevu

ఏటికి వేగిరపడే విపుడు నీవు
Language

(॥పల్లవి॥)
ఏటికి వేగిరపడే విపుడు నీవు
కూటువవేళ నే నిన్నుఁ గొసరేఁ గాక

(॥ఏటి॥)
మనసిచ్చి నీవు నాపె మాఁటలాడుకొనేవేళ
గునిసి నిన్ను సాదించఁగూడునా నాకు
యెనసి నామోము చూచి యేమీయనినవేళ
చెనకి నీకుఁ బ్రియాలు చెప్పేఁగాక

(॥ఏటి॥)
సందడి నా పెయు నీవు సరసమాడేటివేళ
గొంది నీతో బై యాడఁగడునా నాకు
విందుల నాపైఁ జేయివేసినయప్పటివేళ
కందువలంటుచు నిన్నుఁ గై కొనేఁగాక

(॥ఏటి॥)
ననుపున నాపె నీవు నవ్వులు నవ్వేటివేళ
కొనగోరు సోఁకించఁగూడునా నాకు
యెనసితివి శ్రీ వేంకటేశుఁడ యిప్పటివేళ
తనిసితి నింకా మీదఁ దలపించేఁగాక

(||pallavi||)
eḍigi vegirabaḍe vibuḍu nīvu
kūḍuvaveḽa ne ninnum̐ gŏsarem̐ gāga

(||eḍi||)
manasichchi nīvu nābĕ mām̐ṭalāḍugŏneveḽa
gunisi ninnu sādiṁcham̐gūḍunā nāgu
yĕnasi nāmomu sūsi yemīyaninaveḽa
sĕnagi nīgum̐ briyālu sĕppem̐gāga

(||eḍi||)
saṁdaḍi nā pĕyu nīvu sarasamāḍeḍiveḽa
gŏṁdi nīdo bai yāḍam̐gaḍunā nāgu
viṁdula nābaim̐ jeyivesinayappaḍiveḽa
kaṁduvalaṁṭusu ninnum̐ gai kŏnem̐gāga

(||eḍi||)
nanubuna nābĕ nīvu navvulu navveḍiveḽa
kŏnagoru som̐kiṁcham̐gūḍunā nāgu
yĕnasidivi śhrī veṁkaḍeśhum̐ḍa yippaḍiveḽa
tanisidi niṁkā mīdam̐ dalabiṁchem̐gāga