Edigi doorevu seli nimtalo neevu

ఏటికి దూరేవు చెలి నింతలో నీవు
Language

(॥పల్లవి॥)
ఏటికి దూరేవు చెలి నింతలో నీవు
కోటికిఁ బడగెత్తిన గురుతులు గావా

(॥॥)
మచ్చికగలిగినట్టిమగువ గనక గోర-
నెచ్చరించి గీరితే నేమాయను
ముచ్చట నీయందుగలమోహపురాసుల కెల్లా-
నచ్చముగఁ బెట్టినట్టిలచ్చనలు గావా

(॥॥)
తీపులు మరిగినట్టితెఱవ గనక మోవి-
నేపున గంటిసేసితే నేమాయను
పై పై నీజవ్వనపు బండారమున కెల్ల
కాపుగాఁ బెట్టినమాణికపుముద్ర గాదా

(॥॥)
అట్టె చనవరియైన యలమేల్మంగ గనక
యెట్టు పాదాలఁ జిమ్మినా నేమాయను
దిట్ట శ్రీవేంకటేశ రతిమహోత్సవానకు
కట్టినతోరణపుసింగారాలు గావా

(||pallavi||)
eḍigi dūrevu sĕli niṁtalo nīvu
koḍigim̐ baḍagĕttina gurudulu gāvā

(||||)
machchigagaliginaṭṭimaguva ganaga gora-
nĕchchariṁchi gīride nemāyanu
muchchaḍa nīyaṁdugalamohaburāsula kĕllā-
nachchamugam̐ bĕṭṭinaṭṭilachchanalu gāvā

(||||)
tībulu mariginaṭṭidĕṟava ganaga movi-
nebuna gaṁṭiseside nemāyanu
pai pai nījavvanabu baṁḍāramuna kĕlla
kābugām̐ bĕṭṭinamāṇigabumudra gādā

(||||)
aṭṭĕ sanavariyaina yalamelmaṁga ganaga
yĕṭṭu pādālam̐ jimminā nemāyanu
diṭṭa śhrīveṁkaḍeśha radimahotsavānagu
kaṭṭinadoraṇabusiṁgārālu gāvā