ఏటికే యింతేసి పంతా లితనితోను
(॥పల్లవి॥)
ఏటికే యింతేసి పంతా లితనితోను
తాటించి నీ వలపులు దాచనేలే నీవు
(॥ఏటి॥)
కొండవంటిమగవాఁడు కొంగువట్టి తియ్యఁగాను
అండుకాచి లోఁగేవు అదేమే నీవు
దండువెళ్ళి మదనుఁడు దాడివచ్చి వుండఁగను
గుండె రాయిగాఁ జేసుకొనేవేమే నీవు
(॥ఏటి॥)
విడువరానిచుట్టము వేడుకతో నవ్వఁగాను
అడఁకువ సిగ్గువడే వదేమే నీవు
పెడలిదిక్కున వచ్చి పెండ్లి విడిశుండఁగాను
గడుసవై చన్నులేల కప్పేవే నీవు
(॥ఏటి॥)
వేడుకకాఁడైన శ్రీవేంకటేశుఁడు గూడఁగా
ఆడేవు తెక్కులమాట లదేమే నీవు
మేడెపు మేనవాని మెచఁ గాఁగిలించుకోఁగా
యీడ నివ్వెరగు లందే విదియేమే నీవు
(||pallavi||)
eḍige yiṁtesi paṁtā lidanidonu
tāḍiṁchi nī valabulu dāsanele nīvu
(||eḍi||)
kŏṁḍavaṁṭimagavām̐ḍu kŏṁguvaṭṭi tiyyam̐gānu
aṁḍugāsi lom̐gevu ademe nīvu
daṁḍuvĕḽḽi madanum̐ḍu dāḍivachchi vuṁḍam̐ganu
guṁḍĕ rāyigām̐ jesugŏneveme nīvu
(||eḍi||)
viḍuvarānisuṭṭamu veḍugado navvam̐gānu
aḍam̐kuva sigguvaḍe vademe nīvu
pĕḍalidikkuna vachchi pĕṁḍli viḍiśhuṁḍam̐gānu
gaḍusavai sannulela kappeve nīvu
(||eḍi||)
veḍugagām̐ḍaina śhrīveṁkaḍeśhum̐ḍu gūḍam̐gā
āḍevu tĕkkulamāḍa lademe nīvu
meḍĕbu menavāni mĕsam̐ gām̐giliṁchugom̐gā
yīḍa nivvĕragu laṁde vidiyeme nīvu